Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేటు వయసులో మహా రొమాన్స్

Advertiesment
లేటు వయసులో మహా రొమాన్స్ ప్రేమాయణం మధుర జ్ఞాపకం ప్రేయసి ప్రియురాలు ప్రియుడు
WD
పురుషులు తమ 53 ఏళ్ల వయసులో అత్యంత రొమాంటిక్‌గా వ్యవహరిస్తారట. యవ్వనాన్ని దాటి 53 ఏళ్ల వయసులో రొమాన్సా...అని ఆశ్చర్యపోతున్నారా... కానీ ఇది నిజం. స్త్రీలకు తమ పురుషుల నుంచి ఏమి కావాలో తెలుసుకుని వారిని వివిధ రకాలుగా సంతృప్తి కలిగించడంలో 53 ఏళ్ల పురుష పుంగవులే అత్యంత చాకచక్యంగా వ్యవహరించగలరని ఓ సర్వే తేల్చింది.

లండన్‌లోని వార్నర్ లీసర్ హోటల్స్‌కి చెందిన జిమ్ ఫార్వడ్ తమ సర్వేలో భాగంగా స్త్రీల పట్ల పురుషుల రొమాంటిక్ టచ్ అనే అంశంపై అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనంలో 51 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులైన పురుషులు మహా రొమాంటిక్‌గా ఉంటారని వారి భాగస్వాములు వెల్లడించిన వివరాలు తేటతెల్లం చేశాయి.

మధ్యవయస్కులైన పురుషులపై చేసిన సర్వే వివరాలను చూస్తే... మనసుకు హత్తుకునే కవితలను తమ భాగస్వామిపై విసిరి వారిని మరో లోకంలో విహరింపజేస్తున్నవారు 28 శాతం. మరో 48 శాతం తమ భాగస్వాములకు ఏం కావాలో తెలుసుకుని వారి ఇష్ట ప్రకారం నడుచుకోవడం, వీలునప్పుడల్లా పిక్నిక్‌లకంటూ వారిని ఉత్సాహపరచడం వంటి చర్యలతో మహిళల మనసంతా నిండిపోతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu