మీ ప్రేమ మధురజ్ఞాపకాలను మాకు పంపండి... ప్రచురిస్తాం
సృష్టిలో తీయనైన అనుభూతినిచ్చేది ప్రేమ. యువతీ యువకుల మధ్య అనుకోకుండా చిగురించేది ప్రేమ. ఆ ప్రేమ పుట్టిన మరుక్షణం ప్రేయసీ ప్రియుల హృదయాలతో ఆడుకుంటుంది. ఎన్నెన్నో గిలిగింతలు పెడుతుంది. ముద్దులు కావాలంటుంది. మురిపాలు ఇవ్వమంటుంది. కౌగిళ్ల రుచి చూడమంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేయసీ ప్రియులను అన్ని విధాలా.. అన్ని రకాల పనులకు ఆదేశిస్తుంది ప్రేమ. ప్రేమికులు తమ ప్రేమ కలలను సాకారం చేసుకుని ఒక్కటయితే ఇక ఆ జంట అనుభవించే జీవితం మధురాతిమధురం. ఆ మధురానుభూతులను ఎంత పంచుకున్నా ఇంకా సంశేషమే. ఇది ప్రతి ప్రేమ జంటకూ తెలుసు. అటువంటి మధురమైన జ్ఞాపకాలను మీ తలపుల మాటు నుంచి వెలికి తీసి మీ ప్రియతమ పోర్టల్ వెబ్‌దునియా తెలుగుకు పంపిస్తే చాలు. మీ మధురజ్ఞాపకాలను ఎంచక్కా మేము ప్రచురిస్తాం. అయితే, ఇంకెందుకు ఆలస్యం. అయితే, ఇందుకు మీరు చేయవలసినదల్లా.. గతం ప్రేమ తాలూకు అనుభవాలను మాకు పంపడమే. ఆసక్తి గలవారు వారివారి ఫోటోలను పంపిస్తే ప్రచురించగలం. మధురజ్ఞాపకాలను పంపేవారు తమ పేరు, చిరునామాల (ఇష్టం లేకపోతే వదిలేయండి)ను తప్పక జోడించండి. మీ ప్రేమానుభవాలను పంపవలసిన మెయిల్ అడ్రస్[email protected]మెయిల్‌లో To, The Telugu Editor అని రాయండి.శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో..మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్