Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసుపడే మధురమైన బాధ... ప్రేమంటే

Advertiesment
ఇతరాలు ప్రేమాయణం మధుర జ్ఞాపకాలు మనసుపడే మధురమైన బాధ ప్రేమంటే
, గురువారం, 20 నవంబరు 2008 (02:53 IST)
FileWD
ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం... చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం... మింగినాను హలాహలం... అంటూ ఓ సినీ రచయిత కలం నుండి జాలువారిన పాట పల్లవిని విన్నప్పుడు హృదయమున్న ఎవరికైనా అది బరువెక్కక మానదు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమించడం... అలా మనం ప్రేమించినవారు మనల్ని ప్రేమించకపోవడం అన్నది చాలామంది అనుభవంలో ఉన్నదే. అందుకే పైన పేర్కొన్న పాట పల్లవి విన్నప్పుడు గతం ఒక్కసారిగా గుర్తొచ్చి మనసుని కాసేపు మెలి పెట్టక మానదు.

అయితే రోజువారి పనులతో జీవితంలోని ప్రతి క్షణం బిజీ బిజీగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో కొద్దిసేపటికే మన మనసు మరో కార్యంపై లగ్నం కావడం దాంతో అందాకా అన్పించిన మనసు బరువు పక్షిలా ఎగిరిపోవడం మామూలే. అయితే ప్రేమ విఫలం అన్నది గతం కాకుండా వర్తమానంగా ఉన్న వ్యక్తి పై పాటలోని పల్లవి వింటే అతని మనసు పరిపరి విధాలుగా పోతుందనడంలో సందేహం లేదు.
ప్రేమ విఫలం మానిపోని గాయం...
  రెండు మనసులకు సంబంధించిన ప్రేమ ఏనాటికైనా ఆ రెండు మనుసుల మధ్య బంధాన్ని ముడివేయగల్గితే ఆ ప్రేమకథ సుఖాంతమైనట్టే. కానీ అదే ప్రేమ ఓ మనసులో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మరో మనసులో అసలు తన ఉనికినే చాటకపోతే ఇక ఆ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందో ఊహించడం కష్టమే.      


ఎందుకంటే ప్రేమకున్న శక్తి అలాంటిది. దూరంగా ఉండి చూస్తే చిన్నపిల్లల ఆటగాను, గతంగా మారితే చాదస్తంగాను అన్పిస్తుంది. కానీ అదే ప్రేమ వర్తమానంలో తన హృదయంలోనూ మొలకెత్తి చూస్తుండగానే మహా వృక్షంగా పెరిగిపోతే... మనం ప్రేమించినవారు మన గురించి అస్సలు పట్టించుకోకపోతే... మనసులోని ప్రతి అణువునా చొచ్చుకుపోయిన ప్రేమ వృక్షం తాలూకు వేళ్లు మనిషిని ఎంతగా వేధిస్తాయో, బాధిస్తాయో అది వారికి మాత్రమే తెలుస్తుంది.

ఆ సమయంలో తాము ప్రేమిస్తున్నవారిని ప్రసన్నం చేసుకునే దిశగా మనిషి చేయని ప్రయత్నమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఈ భూమి మీద పుట్టిన జీవరాశిలో మనసు, మమత అనే లక్షణాలను తాను మాత్రమే పుణికి పుచ్చుకున్న మనిషికి మాత్రమే ప్రేమ, దానివల్ల కలిగే బాధ సొంతం కావడం ఓ విధంగా అదృష్టం అనుకుంటే మరో విధంగా అది దురదృష్టం అని ఇలాంటి తరుణంలోనే మనిషికి అనిపిస్తుంది.


webdunia
FileWD
అందుకే ప్రేమ అనే బాధను అనుభవించలేక, ప్రేమించినవారి మనసును జయించలేక మనిషి తన జీవితాన్ని సైతం త్యజించడానికి సిద్ధమయ్యే సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. రెండు మనసులకు సంబంధించిన ప్రేమ ఏనాటికైనా ఆ రెండు మనుసుల మధ్య బంధాన్ని ముడివేయగల్గితే ఆ ప్రేమకథ సుఖాంతమైనట్టే.

కానీ అదే ప్రేమ ఓ మనసులో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మరో మనసులో అసలు తన ఉనికినే చాటకపోతే ఇక ఆ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందో ఊహించడం చాలా కష్టం. చుట్టూ ఉన్నవారిలో కొందరు జాలిగా మరికొందరు ఏదీ పట్టనట్టు చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా తన మనసు కోరేవారి కోసం మనిషి చేసే ప్రయత్నం వృధా అయితే ప్రేమ విఫలం అంటూ చూసే వారికి అది చిన్న విషయంగానే అనిపించవచ్చు.
ప్రేమ మైకం అలాగే ఉంటుంది మరి...
  ప్రేమ అయినా మరో బంధమైనా ఇద్దరి మధ్యా అంగీకార యోగ్యమైతేనే విజయవంతం అవుతుంది అనే విషయం మనిషికి తెలిసినా... ప్రేమ అనే విషయంలో మాత్రం ఆ విషయం గుర్తుకు రాకపోవడం విశేషం.      


కానీ ఆ ప్రేమ విఫలాన్ని స్వయంగా అనుభవించేవారికి మాత్రం అది తిరిగి సాధించలేని ఓ పరిపూర్ణ అపజయం. ఎందుకంటే ప్రేమ అనే పరీక్ష జీవితంలో ఒక్కసారే ఎదురవుతుంది కాబట్టి. అలాంటి పరీక్షను ఎంతో నిజాయితీగా ఎదుర్కొన్నా ఫలితం మాత్రం ప్రతికూలంగా వస్తే ఆ వ్యక్తిలో చెలరేగే నిరాశ ప్రారంభంలో రాసిన పాట పల్లవిలా చివరకు విషాధంగానే ముగుస్తుంది.

ప్రేమ అయినా మరో బంధమైనా ఇద్దరి మధ్యా అంగీకార యోగ్యమైతేనే విజయవంతం అవుతుంది అనే విషయం మనిషికి తెలిసినా... ప్రేమ అనే విషయంలో మాత్రం ఆ విషయం గుర్తుకు రాకపోవడం విశేషం. అందుకే తనను కాదన్నవారి గురించే ఆలోచిస్తూ విరహ గీతాలు ఆలపించడం అన్నది ఒక్క ప్రేమ విషయంలోనే యుగాలుగా జరుగుతూనే వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu