Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు భావాన్ని తెలిపే ప్రేమలేఖలు

Advertiesment
మనసు భావాన్ని తెలిపే ప్రేమలేఖలు

Munibabu

, బుధవారం, 16 జులై 2008 (16:27 IST)
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ? అని అడిగితే ఈ కాలంలో ప్రేమలేఖ ఏంటండీ బాబూ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. నిజమే ఆధునికయుగంలో సెల్‌ఫోన్‌లు ఇంటర్నెట్‌లు వచ్చాక అనుకున్న వెంటనే ప్రియురాలు లేదా ప్రియుడితో మాట్లాడేస్తుంటే ఇక లేఖలు రాయాల్సిన అవసరం ఏముంది అన్నది ప్రస్తుతం యువత భావన.

కానీ రోజులు ఎంత మారినా, ప్రపంచం ఎంత ఆధునికమైనా ప్రేమ మాత్రం మారడం లేదు కదా మరి ప్రేమ భావాన్ని తెలిపే ప్రేమలేఖల సంస్కృతిని మాత్రం మనం మార్చేస్తే ఏం బావుంటుంది. అందుకే ప్రేమలో పడ్డ ప్రతివారు అప్పుడప్పుడూ ప్రేమలేఖలు రాస్తేనే వారు ప్రేమలో పరిపూర్ణంగా మునిగినట్టు లెక్క.

అయితే కలం పట్టి కాగితంపై నాలుగు పదాలు రాద్దామంటే వస్తే కదా అంటారా... అయితే ఎవరూ లేని ఓ ఒంటరి ప్రదేశంలో కాసేపు అలా కూర్చోండి. మీరూ మీ ప్రేయసి సరదాగా గడిపిన క్షణాలను కాసేపు గుర్తు చేసుకోండి. ఆ క్షణంలో మీరు అను భవించిన సంతోషాన్ని, మీ ప్రేయసి మీపై చూపించిన ప్రేమ భావానికి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేయండి.


అంతే మీలో ఉన్న కవి కట్టలు తెంచుకుని బయటపడడం ఖాయం. దాంతో మీరు సైతం కవిగా మారిపోగలరు. అయితే ఎంత ప్రయత్నించినా పట్టుమని నాలుగు వాక్యాలు కూడా రాయలేక పోతున్నారా... అయినా చింతించ వద్దు. మీ ప్రేయసి మీకు ఎంత ఇష్టమో, మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో అన్న విషయాల్ని రాసే ప్రయత్నం చేయండి.

రెండు మూడుసార్లు అలా రాసిన తర్వాత ప్రేమగా లేఖలు రాయడం ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అలా రాసిన మీ (ప్రేమ) లేఖల్ని మీ ప్రేయసికి అందించండి. వాటిని చూచి ఆమె మురిసి పోకుంటే ఒట్టు. అయితే ఆమె మురిసిపోయేది కేవలం మీరు ప్రేమలేఖలు రాశారని కాదు.

అందులో తనపై మీరు చూపించిన ప్రేమ ఆ విషయాన్ని రాయడానికి మీరు చేసిన ప్రయత్నం ఇలా ప్రతిదాన్నీ చూచి ఆమె సంతోషపడిపోతుంది. దాంతో మీపై ఆమె ప్రేమ మరింత ఎక్కువవుతుంది. ఇలా ప్రేమలేఖలు రాయడంలో మరో ఉపయోగం కూడా ఉంది.

అందరిలా సెల్‌ఫోన్‌లో ఓ సంక్షిప్త సమాచారాన్ని టైపు చేసి పంపిస్తే రోజూ చూచేదేగా అని తేలిగ్గా తీసిపారేసే మీ ప్రేయసి అకస్మాత్తుగా మీరు రాసిన ప్రేమలేఖల్ని అద్భుతంగా భావించి జీవితాంతం భద్రపర్చుకునే అవకాశం కూడా ఉంది. అందుకే నేడే కలం కాగితం పట్టి ప్రేమలేఖ రాయడానికి సిద్ధమైపోండి.

Share this Story:

Follow Webdunia telugu