Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు పలికే మౌనరాగం... ప్రేమ భావం

Advertiesment
ప్రేమాయణం మధుర జ్ఞాపకాలు మనసు పలికే మౌనరాగం... ప్రేమ భావం
, సోమవారం, 25 ఆగస్టు 2008 (15:48 IST)
యవ్వన ప్రాయంలో మనిషికి తన మనసు చాలా దగ్గరగా ఉన్నట్టు అన్పిస్తుంది. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు మనసుకు స్పందన గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనసు స్పందించిన ప్రతిసారీ మనసు తమతో ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించే మనిషి మనసు తనకు చాలా దగ్గరగా ఉందని భావిస్తాడు.

ఇలా తనకు దగ్గరగా ఉందనకున్న మనసును వేరొకరు కాజేస్తే తన మనసును తిరిగి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో మనసును కాజేసిన వారికి మనిషి కూడా దాసోహమై పోతే ఆ విచిత్ర స్థితే ప్రేమంటే... అందుకే లోకంలో ఎన్ని రకాల ప్రేమ బంధాలున్నా మనసు స్పందించడం ద్వారా స్త్రీ, పురుషుల మధ్య కలిగే ప్రేమ బంధానికే ప్రాముఖ్యత ఎక్కువ.
ఊహకందని మధుర భావం ప్రేమంటే...
  ఒకవేళ ప్రేమికులు తొలి పరిచయం అద్భుతమైన విషయంగా అన్పించకపోతే అసలు వారు ప్రేమికులుగా మారే అవకాశమే లేదు. ఎందుకంటే ఓ ఆడా మగా ఎదురైన ప్రతిసారీ ఆ పరిచయం ప్రేమకు దారితీయడం లేదు కాబట్టి.      


అంతకుముందు ఎలాంటి పరిచయం లేకుండా కనీసం చూచి కూడా ఉండని వ్యక్తి జీవితంలో తొలిసారిగా ఎదురైనపుడు మనసులో కలిగే తొలి స్పందన ఎలా ఉంటుంది ? అని ఎవరైనా ప్రేమికులను ప్రశ్నిస్తే అది వర్ణనకు అందని ఓ అద్భుత భావం అంటూ చెబుతారు. అది విన్నప్పుడు మిగిలినవారికి అందులో ఎలాంటి అద్భుతం కన్పించకపోవచ్చు.

కానీ ప్రేమలో పడ్డ ప్రతివారికీ తమ తొలి పరిచయం ఏనాటికీ ఓ అద్భుతమైన విషయమే. ఒకవేళ ప్రేమికులు తొలి పరిచయం అద్భుతమైన విషయంగా అన్పించకపోతే అసలు వారు ప్రేమికులుగా మారే అవకాశమే లేదు. ఎందుకంటే ఓ ఆడా మగా ఎదురైన ప్రతిసారీ ఆ పరిచయం ప్రేమకు దారితీయడం లేదు కాబట్టి.

కానీ ఒకానొక ప్రత్యేక సందర్భంలో ఎదురైన వ్యక్తి మాత్రం మన గుండె తలుపును తట్టి మరీ మనసులో ప్రవేశించవచ్చు. అందుకు కారణం ఏంటీ అంటే ఇదీ అంటూ ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ప్రేమంటే అలానే ప్రవేశిస్తుంది మరి. అయితే ఇక్కడ మరో విషయం ప్రేమికులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.


తమ మనసును దోచిన వ్యక్తి కంటే అందమైనవారు, హోదా కల్గిన వారు, మరెన్నో విషయాల్లో మెరుగ్గా ఉన్నవారు అంతకుముందు ఎంతోమంది కన్పించి ఉండవచ్చు. కానీ వారెవరి మీదా కలగని ఓ ఆత్మీయభావం ఆ ఒక్కరి మీదే ఎందుకు కల్గింది అని తమ మనసును ప్రశ్నిస్తే... దాని నుంచి మౌనమే సమాధానమవుతుంది.

ఒకవేళ మరీ రెట్టించి ప్రశ్నిస్తే నీకు ఎంతమంది నచ్చినా... నాకు మాత్రం వాళ్లే నచ్చారు. కాబట్టి నాకు వాళ్లే కావాలి అంటూ మనసు మంకు పట్టు పడుతుంది. మనసు పట్టుబడితే ఇక ఏ మనిషీ దాన్ని మార్చలేడు. ఎందుకంటే మనసు లేకుండా మనిషి ఉండడు కాబట్టి.
అది ప్రేమ తప్పు కాదు...
  జీవితంలో బంధాలపై నమ్మకం లేనివారికి, ఇష్టమైనవారి కోసం ఏ త్యాగం చేయడానికీ సిద్ధంగా లేనివారికి ప్రేమ అంటే ఓ పిచ్చి భావంగా, ప్రేమికులంతా పనికిమాలినవారిగా అన్పించవచ్చు.      


మనిషికి సైతం తెలియకుండా మనసులో చేరి గిలిగింతలు పెడుతుంది కాబట్టే యుగాలు మారినా తరాలు మారినా ప్రేమ ఎప్పుడూ ఓ మధుర కావ్యంగా, ఊహకందని అద్భుత భావంగా ఉండగల్గుతోంది. జీవితం ఎంత యాంత్రికంగా మారినా, మనిషి ఎంత కఠిన హృదయుడైనా సరే స్వచ్ఛమైన ప్రేమ భావం ఒక్కసారి మనసును సృశిస్తే చాలు. ఇక అతను ఆ ప్రేమకోసం తన జీవితాన్నే అర్పించడానికి సిద్ధమౌతాడు.

ఇంత గొప్ప లక్షణం ప్రేమకు ఉంది కాబట్టే ప్రపంచంలో ఏమూల మనిషి ఉన్నా అక్కడ ప్రేమ చివురించగల్గుతోంది. తన సువాసనలతో స్పందించే హృదయమున్న ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించగల్గుతోంది. జీవితంలో బంధాలపై నమ్మకం లేనివారికి, ఇష్టమైనవారి కోసం ఏ త్యాగం చేయడానికీ సిద్ధంగా లేనివారికి ప్రేమ అంటే ఓ పిచ్చి భావంగా, ప్రేమికులంతా పనికిమాలినవారిగా అన్పించవచ్చు.

కానీ జీవితంలో బంధాలపై అనురక్తి, ఇష్టమైనవారి కోసం దేనికైనా సిద్ధమయ్యే తత్వం ఉన్నవారికి ప్రేమ ఎప్పుడూ ఓ పవిత్రమైన బంధంగానే కన్పిస్తుంది. అలాంటివారిలో ప్రేమ చిగురిస్తే అది పెరిగి పెద్దదై మరిన్ని హృదయాల్లో ప్రేమ బావాన్ని చిగురింపజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu