Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రాయిడ్‌ ప్రేమ లేఖ

ఫ్రాయిడ్‌ ప్రేమ లేఖ
, ఆదివారం, 3 జూన్ 2007 (18:19 IST)
నా కలల రాణివైన నిన్ను ఉద్దేశించి ఈ పదాలను ఇప్పటి వరకు ఎలా వాడాలో నాకు తెలియలేదు. మన ఇద్దరము (ఆదివారం) కలుసుకోవడానికి ఏర్పాటు చేయమని మీ సోదరికి చెప్పు. మనం కలవబోయే కొద్ది క్షణాలలో నీతో అన్ని విషయాలు మాట్లాడే అవకాశం లభిస్తాదో లేదో తెలియదు.

నువ్వు హేంబర్గ్ వెళ్లుతున్నావా ! దాని గురించి మనం చాలా నేర్పుగా, ఉపాయంగా పనిచేయవలసి ఉంటుంది. ప్రియే మార్ధా ! నువ్వు నా జీవితాన్ని ఎంతగా మార్చేసావు? మీ ఇంటిలో నీ దగ్గర ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. కాని ఎలీ కొన్ని నిమిషాలు పాటు మనకు దొరికిన ఆ అవకాశాన్ని మన స్వార్ధానికి ఉపయోగించు కోవడం నాకు అంతగా నచ్చలేదు.

ఆ సంధ్యా సమయంలోని మన షికారు అనుభూతిని ఎప్పటికి మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. నీ అందమయిన ఆకృతి నుండి దూరంగా కొన్ని నెలల పాటు ఉండవలసి వస్తుంది అని నేను భావించలేదు. కాని దాని వల్ల నీ మీద క్రొత్త ప్రభావం పడుతుంది అని ఊహించలేదు. ఇంత నమ్మకం, సందేహం, సంతోషం రెండు నెలల్లో నిండి వున్నవి.

అపనమ్మకం అనేది నాలో ఇప్పటికే లేదు. ఒక వేళ కొంచెం అయినా సందేహం నాలో ఉంటే నా యొక్క భయాలను ఇప్పుడు నీ మీద ఉంచేవాడినికాను. మార్థా! నువ్వు నన్ను కలుస్తానని నాకు మాట ఇచ్చి చెప్పిన ఉత్తరం గుర్తుందా? కలుస్తావు కదా?

నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ... మనం ఇటువంటి విరహ వేదనను ఎలా భరించగలము. ఇది నీ బాధ్యతే. ఎందుకంటే నేను బీద మనిషిని. అందరూ నన్ను ఏడిపిస్తారు. కాని నా మార్థా మాత్రం ఇలా చెయ్యదని నాకు ఆశగా ఉన్నది.

మీ యొక్క చాచా ఇంటి వద్ద బహుశ ఒక వ్యక్తి వ్రాసిన ఉత్తరం అందరికీ కుతూహలం కలగడానికి కారణం అయివుంటుంది. అందువల్ల నువ్వు నీ కోమలమయిన చేతులతో కొన్ని ఉత్తరాల మీద అడ్రస్‌ రాసి నాకు ఇవ్వు. మిగిలిన ఖాళీగా ఉన్న ఉత్తరాలను నా బాధలతో నింపి నీకు పంపుతాను. నీ జవాబు లేకుండా ఏ పనీ నడవదు. నిన్న ఏదైతే మనం అద్భుతం అని అనుకున్నామో, ఈనాడు అదే జరగకపోతే బాధగా ఉన్నది. ఇప్పటి వరకూ కూడ నాకు నీ మీద సరి అయిన నిశ్చయం లేదు.

నేను ఏదైతే మార్థాతో చెప్పాలి అని అనుకుంటానో అది చెప్పలేను. నాలో ఆత్మ విశ్వాసం తక్కువ. నీలో ఉన్న అందాలు, భావ భంగిమలు, కన్యగా ఉండే దృష్టి ..ఇవి అన్ని నీతో చెప్పడానికి నీ అనుమతి ఉండాలి.

మనం ఒకరి నొకరు కలుసుకున్నప్పుడు నేను నా ప్రేయసిని, నా ఆరాధ్యదేవతను `దూ ' అని పిలుస్తాను. దాని వల్ల చాలా కాలం మన విషయం ఎవరికి తెలియకుండ ఉంటుంది.

ఇది అంతా వ్రాయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఒక వేళ నాలో ఏకాభిప్రాయం లేకపోతే నేను నా సంయమన శక్తిని కోల్పోయి ఏవి అయితే వ్రాసానో అవి నువు్వ చదివి నవ్వినప్పుడు ముఖం ముడుచుకోవడం జరుగుతుంది. దాని వలన నేను ఒక రోజును ఒక యుగంలా గడపవలసివస్తుంది. అప్పుడు నేను నీ యొక్క కళ్ళలోకి చూచి నా సందేహంను నివృత్తి చేసుకుంటాను.

కాని నేను ఎవరో తెలియని వ్యక్తికి ఉత్తరం వ్రాయడం లేదు, నేను రాసే వ్యక్తి నా ప్రియ సఖే కదా అందువల్ల నాకు ఎటువంటి సందేహం లేదు. చాలా రోజుల తర్వాత అనేక సంఘర్షణల తర్వాత నా ఉత్తరం మీద పూర్తిగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను.
నీ ప్రాణ సఖి.

ఫ్రాయడ్‌

Share this Story:

Follow Webdunia telugu