ప్రేమలో రకాలెన్నో? మీకు తెలుసా?
, సోమవారం, 30 డిశెంబరు 2013 (19:13 IST)
ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ప్రేమలో రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ , రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని చెబుతున్నారు. మన్మథ ప్రేమ.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసం బతుకుతారు. రతీ మన్మథులుగా ప్రతిక్షణం ఒకరి కోసం మరొకరుగా బతుకుతారు. ఇందులో వారి వ్యక్తిగత లోపాల ప్రశ్న ఉండదు. రొమాంటిక్ ప్రేమ: ప్రేమ కోసం ప్రేమ ఇది. కలిసివున్నప్పుడు వీరికి ఒకరి మీద మరొకరికి వల్లమాలిన ప్రేమ పుడుతుంది. దూరంగా ఉన్నప్పుడు అంతగా వుండకపోవచ్చు. సాహస ప్రేమికులు : వీరికి ప్రేమించడం ఒక సాహసం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక ఘనకార్యం. అందుకోసమే ప్రేమలో పడతారు. పెళ్ళి తర్వాత కూడా ఇతరులతో ప్రేమాయణం నడపగలిగిన శక్తివంతులుసమాజం కోసం ప్రేమ.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత మధ్యలో తిరిగి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోయే ప్రేమికులు వీరు. ప్రేమించుకుని తిరిగి విడిపోయారని సమాజం వేలెత్తి చూపుతుందనే భయంతో ప్రేమను కొనసాగిస్తారు.