Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో నమ్మకం... జీవిత బంధానికి పునాది

Advertiesment
ప్రేమలో నమ్మకం జీవిత బంధానికి పునాది
, మంగళవారం, 26 ఆగస్టు 2008 (16:18 IST)
ప్రేమంటే ఏమిటని కుర్రకారును ప్రశ్నిస్తే కళ్లలోకి కళ్లుపెట్టి చూచుకోవడం, ఒకే ఐస్‌క్రీంని ఇద్దరు పంచుకోవడం, పార్కులకు, బీచ్‌లకు కలిసి తిరగడం అనే సమాధానాలు రావచ్చు. అయితే ఇవన్నీ ప్రేమలో ఒకభాగం మాత్రమే. ఎందుకంటే కళ్లలోకి కళ్లుపెట్టి చూసుకుంటూ గడిపేస్తామంటూ ఏ ప్రేమికులైనా అంటే వారి ప్రేమ జీవితాంతం నిలుస్తుందన్న గ్యారంటీ తగ్గిపోయినట్టే.

ఎందుకంటే చల్లని సాయంత్రం నదీ తీరానా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి అలా ఆకాశాన్ని చూస్తూ గడిపేస్తామంటే నిజ జీవితంలో ఎల్లప్పుడూ కుదరకపోవచ్చు. నదీ తీరాలు సాయం సంథ్యవేళ కబుర్లు లేని ప్రేమ ఉండకపోవచ్చు. కానీ వాటితోనే కాలం గడుస్తుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పవచ్చు.

ఎందుకంటే పైన చెప్పినవన్నీ ఓ పక్క నడుస్తున్నా ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలంటే మాత్రం అంతకు మించి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ప్రేమికులుగా మారిన జంట జీవితాన్ని సైతం పంచుకునే దంపతులగా మారాలంటే వారి ప్రేమ పక్వత సాధించాల్సిన అవసరముంది.

ఒకరిపై ఒకరికి నమ్మకం, జీవితాంతం కలిసి ఉండాలనే తపన, ఎవరికోసం కూడా ప్రేమను త్యాగం చేయకూడదనుకునేంతటి ఇష్టం లాంటివి ఉన్నప్పుడే షికార్లు చేసిన ప్రేమ జీవితాంతం కలిసి పయనించేందుకు తోడ్పడుతుంది. కళ్లు కలుసుకుని మనసులు ఊహలు చెప్పుకుని మొదలైన ప్రేమ భావాలు పంచుకుని ఒకరికోసం ఒకరు తమను మార్చుకోవడానికి కూడా సిద్ధపడినపుడే పూర్తి పరిపూర్ణత సాధిస్తుంది.


ప్రేమలో అలాంటి స్థితి రావాలంటే ప్రేమికులుగా మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. ప్రేమలో పడ్డ కొత్తల్లో ప్రేయసి లేదా ప్రియుడి మనసును గెలిచేందుకు మీ గురించి ఏవో కొన్ని అబద్ధాలు చెప్పి ఉండవచ్చు. కానీ ఇద్దరి మధ్య ప్రేమబంధం మొదలయ్యాక కూడా ఆ అబద్ధాలు కొనసాగించడం పూర్తిగా తప్పే. ఎందుకంటే ప్రేమబంధం శాశ్వతం కావాలంటే ప్రేమికులకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం అవసరం.

అది ఉన్నప్పుడే ప్రేమ పునాదులపై నిర్మించే జీవితం కలకాలం స్థిరంగా ఉంటుంది. అందుకే పైన చెప్పినట్టు ప్రేమికుల్లో ప్రేమ వృద్ధి చెందేకొద్దీ తమని గురించి ఎదుటివారి వద్ద పూర్తిగా ఆవిష్కరించాలి. అలా ఆవిష్కరించినపుడు ఎదుటివారికి నచ్చనిది ఏదైనా ఉంటే ఆది ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అయితే దాన్ని తప్పకుండా మార్చుకోవాలి.

అలా ఇద్దరూ చేయగల్గితేనే వారి ప్రేమ జీవిత బంధానికి దారితీస్తుంది. ప్రేమ పేరుతో పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరగడానికి చూపించిన ఉత్సాహం, చొరవను ఆ బంధాన్ని కలకాలం కాపాడుకోవడంలో కూడా ప్రదర్శించగలగాలి. ఎప్పుడైనా ప్రేమబంధంలో విభేధాలు తలెత్తినా వాటిని పొడింగింపక పట్టువిడుపు ధోరణి ప్రదర్శించగల్గితే అలాంటి వారి ప్రేమ ముందు ముందు జీవిత పర్యంతం కొనసాగేందుకు రాచబాట ఏర్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu