యవ్వనంలోని ఓ అబ్బాయికి అమ్మాయిపై, అమ్మాయికి అబ్బాయిపై కలిగే ప్రేమకున్న బలం చెప్పడానికి వీలులేనిది. వర్ణించడానికి భాషలేనిది. అలాంటి ప్రేమలో పడ్డవారు అనుభవించే అనుభూతి వారికి మాత్రమే సొంతమైంది. అలాంటి ప్రేమలో సంభవించే కష్టాలు, బాధలు సైతం ప్రేమికులకు సుఖాలుగాను, ఆనందాలుగానూ అనిపిస్తాయి. అందుకే ప్రపంచంలో ప్రేమ అనే ఆ భావం ఏనాటి నుంచో ప్రారంభమై నేటికీ నిత్య యవ్వనంతో అనుక్షణం ఎవరో ఒకరి మనసులోకి అడుగు పెడుతూనే ఉంటోంది. అలాంటి మధురమైన ప్రేమ మనసు తలుపు తట్టినప్పుడు అందుకు కారణమైన వారికోసం మనిషి తపించిపోతుంటాడు. |
ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకరిలో ప్రేమ ఏర్పడి మరొకరిలో ప్రేమ ఏర్పడకపోతే ప్రేమ పేరుతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు.
|
|
|
తమ మనసులో ప్రేమ చిగురించడానికి కారణమైన వారూ తమ ప్రేమను అంగీకరించాలని ప్రేమలోకంలో తమతో కలిసి అడుగులు వేయాలని తామిద్దరే ఉండే ప్రేమలోకంలో మరెవరూ అడుగుపెట్టరాదని ఇలా అనేకరకాలుగా సాగుతుంటుంది ప్రేమలో పడ్డ మనిషి ఆలోచనలు.
జీవితంలో ఓ అమ్మాయి, అబ్బాయి ఎదురుపడినప్పుడు ఇద్దరిలో హటాత్తుగా ప్రేమ చిగురించవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. అలాగే ఇద్దరు ఎదురైనప్పుడు ఒకరిలో ప్రేమభావం చిగురించవచ్చు. అయితే మరొకరిలో ఎలాంటి భావం చిగురించకపోవచ్చు. జీవితంలో ఇలాంటి సందర్భాలే ఎక్కువగా జరుగుతుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తమలో పుట్టిన ప్రేమ భావం ఎదుటివారిలోనూ పుట్టేలా చేసి అటుపై ఇద్దరూ ప్రేమలోకంలో విహరించాలంటే అందుకు చాలాకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఎదుటివారితో చనువు ఏర్పడి వారిలోనూ ఎదుటివారిపై ఆకర్షణ ఏర్పడి చివరకు అది ప్రేమగా మారాలంటే కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకరిలో మాత్రమే చిగురించిన ప్రేమ మరొకరిలో ఎంతకాలమైన ఎంతగా ప్రయత్నించినా చిగురించకపోవచ్చు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఆ కారణాలు ప్రస్తుతం ఇక్కడ అనవసరం. మరి ఒకరిలో మాత్రమే ప్రేమ పుట్టి మరొకరిలో ప్రేమ పుట్టకపోతే అలాంటి ప్రేమ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితమైన సమాధానం చెప్పలేం. |
ప్రేమకోసం ఎదుటివారిపై అఘాయిత్యానికి సైతం ప్రయత్నించడం అనేది మనిషిలోని రాక్షసత్వానికి ప్రతీకే గానీ స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ తనవారి క్షేమాన్ని కాంక్షిస్తుందే కానీ వారిని నాశనం చేయాలని ఎప్పటికీ అనుకోదు.
|
|
|
అలాంటివారు తమ ప్రేమను చంపేసుకోవాలా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేం. ఎందుకంటే రెండూ దాదాపు క్లిష్టమైన ప్రశ్నలే. కానీ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకరిలో ప్రేమ ఏర్పడి మరొకరిలో ప్రేమ ఏర్పడకపోతే ప్రేమ పేరుతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు.
ప్రేమ అనేది మనసు లోతుల్లోంచి అకస్మాత్తుగా పుట్టాలి. అలా పుడితేనే ప్రేమ పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. అలా కాకుండా నాలో ప్రేమ పుట్టింది కాబట్టి నా ప్రేమను ఒప్పుకుని నువ్వూ నన్ను ప్రేమించు అంటూ బ్రతిమాలో, భయపెట్టో ఎదుటివారి ప్రేమను పొందాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అలా పొందే ప్రేమ ఎక్కువకాలం నిలబడదు.
అయితే ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో ఎదుటివారిని బాధ పెట్టడం రివాజుగా మారింది. నువ్వు నాకు నచ్చావ్ కాబట్టి నేనూ నీకు నచ్చి తీరాలి. అలా కాకుంటే నీ అంతు చూస్తా అంటూ తిరిగే రౌడీ బాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ఇలాంటి వికృత పోకడలకు కారణాలేవైనా ఈ ధోరణి మాత్రం హర్షనీయం కాదు.
ప్రేమ అనేది మనలో చిగురించినపుడు దానికోసం మనిషి నిరీక్షించగలగాలి. ఎంతకాలం అంటే ఈ జన్మలో దక్కకుంటే మరో జన్మవరకైనా వేచి ఉండాలి. అంతేకానీ ప్రేమించమంటూ ఎదుటివారిని ఇబ్బందిపెట్టి పొందేది ప్రేమకాదు.
అలాంటి ప్రేమకోసం ఎదుటివారిపై అఘాయిత్యానికి సైతం ప్రయత్నించడం అనేది మనిషిలోని రాక్షసత్వానికి ప్రతీకే గానీ స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ తనవారి క్షేమాన్ని కాంక్షిస్తుందే కానీ వారిని నాశనం చేయాలని ఎప్పటికీ అనుకోదు.