Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం

ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం
FileFILE
జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవారికి, ప్రేమించినవారికి ఆ బంధం జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. యవ్వనం పురివిప్పేవేళ, జీవనగమనంలో ఓ కొత్త తోడు కోసం మనసు ఆరాటపడుతున్న సమయంలో ఎదురయ్యే ప్రేమ భావం సఫలమైనా, విఫలమైనా అటు తర్వాతి జీవితంలో అది ఓ అద్భుతమైన భావంగా మదిలో నిల్చిపోతుంది.

అలా నిల్చిపోయిన ఆ భావం ఏ క్షణం గుర్తుకు వచ్చినా మనసు మొత్తం ఓ మధురమైన భావంతో తడిసిపోకమానదు. అందుకే జీవితంలో ఒక్కసారైనా మనస్పూర్తిగా, ఎలాంటి అరమరికలు లేకుండా, లే దురుద్ధేశ్యాలు లేకుండా రెండు మనసులు ఒకదానితో ఒకటి పెనవేసుకోగలిగినప్పుడు సదరు వ్యక్తుల మధ్య కలిగే ఆ అందమైన అనుభూతి వర్ణించ వీలుకానిది. అంతేకాదు ఏళ్లు గడిచినా ఆ భావం ఓ మలయమారుతంలా మనసును చుట్టుముట్టేస్తూనే ఉంటుంది.

అయితే కేవలం ఓ ఆకర్షణగా మాత్రమే ప్రేమను భావించిన వారికి రోజులు గడిచాక ఆ ప్రేమలో అంతటి లోతు కన్పించకపోవచ్చు. అలాగే వారి ప్రేమలో గుర్తుకువచ్చేంతటి మధురానుభూతులు సైతం కన్పించకపోవచ్చు. కానీ నిజమైన ప్రేమభావం జనించినప్పుడు అది ఏనాటికై ఓ మధుర కావ్యమే.

కాకుంటే అలాంటి ప్రేమ జయించి జీవితంలో ఆ ప్రేమికులిద్దరూ ఒకటైతే ఆ మధుర కావ్యం మరింతగా వెలుగులీనుతుంది. అలాకాక అంతటి అపురూపమైన ఆ ప్రేమ వీలుకాని పరిస్థితుల్లో విఫలమైనా ఆ భావం తాలూకు మధుర స్మృతులు సదరు ప్రేమికుల హృదయాల్లో జీవితం చివరివరకు ఓ అద్భుత భావంగా నిక్షిప్తం కాకపోవు.

Share this Story:

Follow Webdunia telugu