Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణయ జీవిత మాధుర్యానికి ప్రేమ పునాది

Advertiesment
మధుర జ్ఞాపకాలు ప్రణయ జీవిత మాధుర్యానికి ప్రేమ పునాది

Munibabu

, బుధవారం, 6 ఆగస్టు 2008 (19:37 IST)
జీవితంలో యవ్వనం అనేది ప్రతి మనిషికీ ఓ ముఖ్యమైన కాలం. జీవితంలోని మిగిలిన అన్ని వయస్సులో ఒక్కోరకమైన భావం మనిషిని ఆవహిస్తే యవ్వనంలో మాత్రం అన్ని రకాల భావాలు మనిషిలో అడుగుపెడుతాయి. కేవలం భావాలకే కాదు ప్రణయభావానికి సైతం యవ్వనం ఓ కీలకమైన దశగా చెప్పవచ్చు.

మిగిలిన వయసుల్లో ఇతరత్రా అంశాలు మనిషిని ఆక్రమిస్తే యవ్వనంలో అన్ని అంశాలతో పాటు ప్రణయభావం కూడా ఓ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అందుకే యవ్వనంలో అడుగుపెట్టే ప్రణయ భావాల తీవ్రత ఎంతలా ఉంటుందంటే దానికోసం మనిషి ఇతర అంశాలను పక్కనబెట్టేంతగా అది మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
  మనిషిలోని ప్రణయభావం మనసులోని ప్రేమభావంతో ముడిపడగల్గితే ఇక ఆ మనిషి ప్రణయ జీవితం ఆనందాల అంచులను తాకగల్గుతుంది.       


ఇంతలా యవ్వనంలో మనిషిపై ప్రభావాన్ని చూపే ప్రణయ భావం తనకు సరిజోడైన వారిని చూచినపుడు అది ప్రేమగా మారి తనవారిని చేరుకోమంటూ మనిషిని తొందర చేస్తుంది. ప్రణయభావానికి సంకేతంగా ప్రేమ ఉదయిస్తుంది కాబట్టే యవ్వన ప్రాయంలో మనిషిలో చిగురించిన ప్రేమభావం మనిషిని అంతలా ప్రభావితం చేయగల్గుతుంది.

అయితే ప్రణయభావంలోంచి పుట్టుకొచ్చినా ప్రేమ మాత్రం కేవలం ప్రణయ భావానికే పరిమితమవదు. తనకు నచ్చినవారిలో ప్రణయభావంతో పాటు మరెన్నో అంశాలతో అది సానిహిత్యాన్ని సంబంధాన్ని కోరుకుంటుంది. అందుకే ప్రణయభావం నుంచి ప్రేమ పుట్టినా అది నిజమైన బంధంగా మారాలని ఎప్పుడు ప్రయత్నిస్తోందో అప్పుడే మనిషిలోని ప్రేమ సంపూర్ణత్వాన్ని సాధిస్తుంది.

ఎందుకంటే యవ్వనంలో ప్రణయభావం అనేది దేహ అవసరాలకు సంబంధించిందే అయినా అది ప్రేమగా మారినపుడు దేహంతో పాటు మనసునీ సొంతం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది. అలా మనిషిలోని ప్రణయభావం మనసులోని ప్రేమభావంతో ముడిపడగల్గితే ఇక ఆ మనిషి ప్రణయ జీవితం ఆనందాల అంచులను తాకగల్గుతుంది.
  ప్రేమను కూడా కలిగిన ఇరు దేహాలు కామంతో ఏకమైనపుడు అవి జీవితాతం అదే బంధానికి కట్టుబడుతాయి. కానీ అదే దేహాలు ప్రేమ లేకుండా కేవలం కామంతోనే ఏకమైతే ఆ ముచ్చట కాస్తా తీరాక వ్యతిరేక దృవాల్లా చెరో దిక్కుకు సాగిపోతాయి.      


అలా ప్రేమతో కూడిన ప్రణయ సంబంధాన్ని నిలుపుకోగల్గితే దేహంలో ప్రణయభావం అస్తమించినా మనసులో మిగిలిన ప్రేమభావం మాత్రం ఆ దేహాలను ఎన్నటికీ కలిపి ఉంచగల్గుతుంది. అయితే ప్రేమ లేని కామం ఉంటుంది గానీ కామం లేని ప్రేమ మాత్రం ఉండదు... అనే వాక్యాలు మనం అప్పుడప్పుడూ మన చెవిలో పడుతుంటాయి.

మనిషి యవ్వన ప్రాయంలో కలిగే కామవాంఛల్లో ప్రేమ కూడా ఓ భాగమని అంతే తప్ప ప్రేమ కావ్యాల్లో చెప్పినట్టు ప్రేమ మరీ అంతగా మనిషిని ప్రభావితం చేయలేందు అనేది కొందరి వాదన. అలాంటి వారు చెప్పినట్టు కామం లేని ప్రేమ ఉండదు అన్న వాక్యాలు నిజమే అయినా ఆ కామంలోనూ మనిషికి అనిర్వచనీయమైన సంతృప్తిని సొంతం చేసేదే ప్రేమంటే.

ఎందుకంటే ప్రేమను కూడా కలిగిన ఇరు దేహాలు కామంతో ఏకమైనపుడు అవి జీవితాతం అదే బంధానికి కట్టుబడుతాయి. కానీ అదే దేహాలు ప్రేమ లేకుండా కేవలం కామంతోనే ఏకమైతే ఆ ముచ్చట కాస్తా తీరాక వ్యతిరేక దృవాల్లా చెరో దిక్కుకు సాగిపోతాయి. అందుకే ప్రణయ జీవితంలో సంపూర్ణమైన మాధుర్యాన్ని సొంతం చేసుకోవాలంటే అది ప్రేమ అనే పునాదిపై మాత్రమే సాధ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu