Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి ముద్దు..ఓ తియ్యని అనుభూతి

Advertiesment
ప్రేమాయణం మధురజ్ఞాపకాలు తొలిముద్దు తియ్యని అనుభూతి ప్రియుడు ప్రియురాలు

Gulzar Ghouse

ప్రతి ప్రియుడు తన ప్రియురాలిని ముద్దుపెట్టుకోవాలనుకుంటాడు. దాదాపుగా ప్రతి వారు తమ ఇష్టమైన ప్రేమికులను ముద్దాడాలని తహతహలాడుతుంటారు. అది కూడా వద్దు..వద్దంటూనే.. ఆ ముచ్చట తీర్చేసుకుంటుంటారు.

తొలిసారిగా ప్రియులు తమ ప్రేమికులతో ముద్దాడాలనుకున్నప్పుడు కాస్త తోట్రుపాటు తప్పదు. మాట్లాడుతూనే ఎలా ముద్దాడుకోవాలో వారికి తెలియదంటున్నారు పరిశోధకులు. తొలిసారిగా తన చెలిని ముద్దాడడం ఓ సాహసం లాంటిదే. ఎందుకంటే ముద్దు పెట్టేటప్పుడు తన సఖి ప్రతిస్పందన ఎలావుంటుందనేది కాస్త అనుమానంగానే వుంటుంది.

సాధారణంగా ముద్దు సీన్లు మనం సినిమాలలో చూస్తుంటాం. కాని ఆ పద్దతులు కాస్త సందేహాలకు తావిస్తాయి. మీరు తొలిసారిగా ముద్దాడుతుంటే మీ గుండె లబ్‌డబ్ వేగం పెరిగిపోతుంది. ఆ తర్వాత రేయింబవళ్ళు మీరు మీ ప్రియమైన వారి గురించే ఆలోచిస్తుంటారు. తొలి ముద్దు మీ రొమాన్స్‌కు పునాది. దీనిని ఓ తియ్యని అనుభూతిగా మలుచుకోవడానికి కొన్ని చిట్కాలు మీ కోసం..

తొలి ముద్దు ఎప్పుడు?

ప్రేమికులు కలిసిన తర్వాత తమతమ ఇండ్లకు వెళ్లేటప్పుడు ముద్దాడడం సరైన సమయం. దీనిని గుడ్ బాయ్ కిస్ అంటారు. తొలిసారిగా పెట్టే ముద్దుకు దీనికి మించి వేరే సమయం లేదు. ఒకవేళ మీరు మొదటి కలయికలోనే వారికి ముద్దు పెడితే వారిపై మీకున్న అభిప్రాయం తెలిసిపోతుంది.

ముద్దెట్టాలని ఎలా తెలుస్తుంది?

చాలామందికి ముద్దుపెట్టాలని తెలియదంటున్నారు పరిశోధకులు. కాని ఎదుటి వారి హావభావాలతో తప్పకుండా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. ఈ భావాన్ని పసిగట్టడం ప్రేమికుల పని. మాటిమాటికి మీ ప్రియరాలు మిమ్మల్ని తాకుతూకూర్చొనివుంటే ముద్దెట్టమని భావం అని అంటున్నారు విశ్లేషకులు.

తొలిముద్దు ఎలా వుండాలి?

తొలిముద్దు అనేది మీ వ్యవహారాలకు సంబంధించి, మీ ఆలోచనలకు గుర్తుగావుండాలి. కాబట్టి తొలిముద్దు చాలా మృదువుగావండాలి. అది మీ సంబంధాన్ని బలపరిచేదిగా వుండాలి.

తొలిముద్దులో మీనుండి లాలాజలం రాకుండా జాగ్రత్తపడండి. కేవలం పెదాలతోమాత్రమే పెట్టేముద్దైతే బాగుంటుందంటున్నారు. ఇది మీ ప్రేమకు పారాకాష్టగా పేర్కొనవచ్చు. తొందరపడి నోట్లో నోరు పెట్టాలని మాత్రం అనుకోకండి. దీనిని ముద్దు అనరు.

తొలిముద్దు ఎంతవరకుండాలి?

తొలిముద్దు అనేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమేవుండాలి. దీనికి సమయం అంటూ ఏదీ లేదు. కానీ మీ ప్రియుడు ముద్దు పెట్టేటప్పుడు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.

ప్రతి వ్యక్తికి ముద్దు పెట్టడంలో తనదంటూ ఓ స్టైల్ వుంటుంది. ఆ స్టైల్‌తోబాటు ఈ చిట్కాలు పాటిస్తే ఆ అనుభూతే వేరంటన్నారు. ఇంతవరకు మీ ప్రియురాలికి ముద్దు పెట్టకపోతే మీరు సిద్దంకండి.

Share this Story:

Follow Webdunia telugu