మగువలతో పోలిస్తే, మగమహారాజులు తరచూ కౌగిళ్లు(సెక్స్ కాదు), ముద్దులకు తమ సంబంధాల్లో అత్యంత ప్రాధాన్యతనిస్తారట! వాటి ద్వారానే తమ ప్రియురాళ్లతో, జీవిత భాగస్వాములతో బంధాన్ని మరింత దృఢపరచుకుంటారని ఒక పరిశోధనలో వెల్లడయింది. ఒక విధంగా చెప్పాలంటే, మగువలకు కౌగిళ్లు, ముద్దులనేవి పెద్దగా పట్టవు.
తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, బ్రెజిల్ దేశాలకు చెందిన 100 జంటలను ఇంటర్వ్యూ చేశారు. వారంతా సంసార బంధంలో ప్రవేశించి 1 నుండి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు. తరచూ తమ జీవిత భాగస్వామిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా పురుషులు తమ ప్రేమను వెల్లడించేందుకు ఇష్టపడతామని సర్వేలో పాల్లొన్న పురుషులు చెప్పారు. రోజులో కనీసం మూడుసార్లయినా అలాచేయకపోతే, వారికి ఏదో కోల్పోయినట్లు ఉంటుందన్నారు.
అయితే, ఈ ముద్దులూ, కౌగిలింతలూ వారితో బంధాన్ని సంతృప్తి కలిగించవని మగువలు స్పష్టం చేయడం విశేషం. భర్తతో శృంగారంతోనే తమ బంధానికి పరమార్థం ఏర్పడుతుందని వారు భావిస్తున్నట్లు తెలిపారు. నిజానికి, పైకి గంభీరంగా కనిపించే మగాళ్లలో అంతర్గతంగా భావోద్వేగాల పాళ్లు అధికమేనని వైద్యులు అంటున్నారు. తమ జీవిత భాగస్వామిని తాము కంటికి రెప్పలా చూసుకుంటున్నామని తెలియచేసేందుకు పలు రకాల హావభావాలను వ్యక్తం చేస్తారు. అందులో భాగమే ఈ కౌగిలింతలూ ముద్దులు. విచిత్రమయిన విషయమేమింటే, ఇలా చీటికి మాటికి తమను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకోవడం తప్పించి తమతో సరయిన రీతిలో శృంగారానికి వారికి తీరికే ఉండటం లేదని వారు ఆరోపిస్తున్నారు.