Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుర్రకారుకు అంత దూకుడెందుకంటే..?

Advertiesment
ప్రేమాయణం మధుర జ్ఞాపకాలు కుర్రకారు లాస్ఏంజిల్స్ కాలిఫోర్నియా కొలరాడో టెంపుల్ యూనివర్సిటీ పరిశోధకులు
ఉరకలెత్తే హుషారు, కావాల్సింది సాధించుకునేందుకు తెగించే పోరాడే పట్టుదల, కొండలనైన పిండి చేయగలమన్న ఆత్మ విశ్వాసం... ఇవీ నేటి యువత ప్రత్యేకతలు. వీరిలో అంత దూకుడుతనం ఎందుకుంటుంది.. దీని వెనుకనుండే కారణాలేంటి? అన్న కోణంలో లాస్‌ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా, కొలరాడో, టెంపుల్ యూనివర్సిటీల పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే... ఉరకలెత్తే హుషారులో తాము చేయాలనుకున్నది చేయడమే తప్ప.. తరువాత ఎదురయ్యే పరిణామాలు, ఎదుర్కోబోయే సమస్యల గురించి ఈనాటి యువత ఏమాత్రం ఖాతరు చేయరని పరిశోధకులు కనుగొన్నారు. మత్తుపదార్థాల వినియోగంగానీ, శృంగార కార్యకలాపాలుగానీ.. మరే ఇతర విషయాలనైనా సరే కుర్రకారు లెక్క చేయట్లేదట.

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ... ఇందుకు గల కారణాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. పై అధ్యయనానికిగానూ 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. వీరంతా సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం.

ఇప్పటిదాకా వారు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని... వివిధ వయస్కులవాళ్లు ఎంతవరకూ ఆలోచిస్తారో తెలుసుకునేందుకుగానూ పరిశోధకులు ఒక ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలను రాబట్టారు. ఇందులో వారు దీర్ఘకాలంలో వచ్చే భారీ ప్రయోజనాల కంటే, తక్కువ కాలంలో లేదా అప్పటికప్పుడు వచ్చే స్వల్ప ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది.

కాస్తంత వయసు మీదపడిన వారితో పోల్చితే.. ఎక్కువశాతం మంది యువతీ యువకుల ఆలోచనలు ఇలాగే ఉన్నట్లు పై పరిశోధనల్లో తేలింది. ఇందుకు యువతీ యువకుల మస్తిష్కంలో సంచలనాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించే విభాగం పూర్తి స్థాయిలో ఎదగక పోవడమే కారణమని పరిశోధకులు నిర్ధారించారు.

Share this Story:

Follow Webdunia telugu