Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమర ప్రేమ గాధ...

అమర ప్రేమ గాధ...
, ఆదివారం, 3 జూన్ 2007 (18:18 IST)
జననం... మరణం.... ఈ రెండిటి చక్రభ్రమణంలో సదా సజీవంగా సాగే మానవేతిహాసంలో అమరత్వం సిద్ధించినది ఏదైనా ఉందీ అంటే... ఇది ప్రేమ ఒక్కటే. కొందరి మనస్సుల్లో సర్వసా`దారణంగా ఒక సందేహం ఉంటుంది. ఈ సష్టిలో సర్వం ఏదో ఒకనాడు నాశనం కాక తప్పనప్పుడు మరి ప్రేమ మాత్రం అమరం ఎందుకు అవుతుంది? దీనికి సరైన సమా`దానం ఒక్కటే. ఈ ప్రపంచమే ప్రేమ అనే భావనతో సష్టించబడింది. అటువంటప్పుడు ప్రేమ ఎలా మరణిస్తుంది! మన దేశంలోనే కాదు. దేశదేశాలలోనూ జ్ఞానులు ఏనాడో ఉద్ఘోషించారు - మత్యువు సైతం జీవనానికి ఒక రూపాంతరమే అని! కాబట్టే మరణాలు సంభవించినంత మాత్రాన మానవ జీవనం ఆగలేదు. అది కొనసాగుతునే ఉంది. మానవాళి మనుగడకు హదయస్పందన ప్రేమ. ఉఛ్వాసనిశ్వాసలు ప్రేమ.

సెయింట్‌ వాలెంటైన్‌ ప్రేమ అనే సందేశాన్ని ఈ ప్రపంచానికి చాటి లోకం వీడారు. కానీ ఆయన ప్రేమ ఇప్పటికీ అమరంగానే నిలిచిపోయింది. ప్రేమకు మరణం లేదు. వాలెంటైన్‌ మాత్రమే కాదు. మరెందరో ప్రేమికులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి తమ ప్రేమకు అమరత్వాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఎందరో లైలా-మజ్నూలు, అంబికాపతి - అమరావతి, సోహ్న - మహివాలా వంటి వారు. వాళ్ళు వెళ్లిపోయి వందల ఏళ్లు గడుస్తున్నా... వారి ప్రేమపథంలోనే ముందుకు సాగడానికి ఇప్పటికీ యువప్రేమికులు తపించడానికి కారణం ఒక్కటే... ప్రేమకు మరణం లేదన్న సత్యం వారికి తెలియడమే!

లైలా - మజ్నుల ప్రేమ గాధ

అమర జీవులైన లైలా-మజ్ను ప్రేమికులు. అరేబియా దేశానికి చెందినవారు. వీరిద్దరూ భౌతికంగా లేకపోయినా ఇప్పటికి శాశ్వతంగా బతికున్నారనడానికి, వీరి ప్రేమే ఓ చక్కని ఉదాహరణ. షాఅమారి కుమారుడైన కైసిన్‌ మరో పేరే మజ్ను. ఇతడి జాతకాన్ని చూసిన జ్యోతిష్కుడు `` ఇతడు ప్రేమకోసమే పుట్టాడని'' నిర్థారణగా చెప్పాడు. అది భరించలేని షాఅమారి రోజు భగవంతుణ్ణి. ``తన కుమారుడి జాతకం అబద్ధం కావాలని'' ప్రార్థించేవాడు.

మజ్ను మొట్ట మొదటిసారి నాజత్‌షా కుమార్తె లైలాను మసీదులో చూశాడు. తన తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇది గమనించిన మసీదులోని మత గురువులు మజ్నును మందలించారు. తరచు మసీదులో లైలాను కలుసుకుంటూ, అదే ధ్యాసలో ఉండిపోయేవాడు. లైలా కూడ మజ్నును ప్రేమించడం వల్ల వారిద్దరి మధ్య విడదీయరానంతగా ప్రేమ నాటుకుపోయింది.

ఈ విషయం తెలుసుకున్న లైలా తల్లిదండ్రులు, లైలాను ఇంట్లోనే నిర్భంధించేవారు. లైలాకు దూరమైన మజ్ను పిచ్చివాడిలా మానసికక్షోభకు గురై అనారోగ్యం పాలయ్యాడు. వీరి ప్రేమను అర్థం చేసుకోని పెద్దలు వీరిని విడదీయడమేగాక లైలాను ``భగత్‌'' కిచ్చి పెళ్ళి చేశారు. అయినప్పటికి లైలా తన మనసును మార్చుకోలేదు. భార్యా భర్తల మధ్య అనురాగము కొరవడడంతో, భగత్‌కు సందేహం కలిగి లైలాను నిలదీశాడు. లైలా తన గాధను వివరించి విడాకులు కోరింది. ఆమె ఇష్టానుసారం భగత్‌ విముక్తి ప్రసాదించాడు. విడిపోయిన లైలా, మజ్ను మళ్ళి కలుసుకున్నారు.

ఇది చూసి భరించలేని పెద్దలు, వారిని కలుసుకోనీయకుండా అడ్డుపడేవారు. ఈ బాధ భరించలేని లైలా ప్రాణాలు విడిచింది. ఈ వార్త విన్న మజ్ను కూడా తక్షణమే ప్రాణాలు విడిచాడు. వీరిద్దరి చావుతో లోకం కళు్ళ తెరిచింది. వారి పవిత్రప్రేమను వెలుగు చూసిన పెద్దలు, మత గురువులు, తదితరులు `` ఈ లోకంలో కలిసి బతకలేని వీరిద్దరు, కనీసం పరలోకంలోనైనా కలిసుండాలి '' అని లైలా సమాధి పక్కనే మజ్ను సమాధి కట్టారు. ప్రేమకు చావులేదని వారి పవిత్ర ప్రేమ ఈ లోకానికి చాటి చెబుతుంది.

ఈ ప్రపంచం ఉన్నంతవరకు వీరి ప్రేమ విరాజిల్లుతుంది. ఇప్పటికీ ప్రేమికులు వీరి సమాధి స్థలాన్ని పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. ప్రేమ అమరం అఖిలం.

Share this Story:

Follow Webdunia telugu