Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాంఛను అధికం చేసే కిస్ హార్మోన్.. దీని కిక్కే వేరప్పా అంటున్న పరిశోధకులు

శరీరంలోని ఏ భాగాన్ని తాకితే, ఏ భాగాన్ని రబ్ చేస్తే ఎలాంటి ఫీలింగులు వస్తాయి ముఖ్యంగా ఆడవారిలో కలిగే సెక్స్ భావనలు ఏ చేస్తే ఉద్దీపన జరుగుతుందో మనకు వేల సంవత్సరాల క్రితమే వాత్సాయనుడు ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం కామసూత్రలో విప్పి చెప్పాడు. కాని మనోవాంఛలకు ప్

Advertiesment
వాంఛను అధికం చేసే కిస్ హార్మోన్.. దీని కిక్కే వేరప్పా అంటున్న పరిశోధకులు
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (04:49 IST)
శరీరంలోని ఏ భాగాన్ని తాకితే, ఏ భాగాన్ని రబ్ చేస్తే ఎలాంటి ఫీలింగులు వస్తాయి ముఖ్యంగా ఆడవారిలో కలిగే సెక్స్ భావనలు ఏ చేస్తే ఉద్దీపన జరుగుతుందో మనకు వేల సంవత్సరాల క్రితమే వాత్సాయనుడు ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం కామసూత్రలో విప్పి చెప్పాడు. కాని మనోవాంఛలకు ప్రేరణ ఏది అంటూ భౌతికంగా సమాధానాలు చెబుతోంది ఆధునిక శాస్త్రం. కిస్ హార్మోన్ అనే ఒక లైంగిక ప్రేరణలు కల్గించే హార్మోన్ కలిగించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు తాజా పరిశోధకులు.
 
చక్కటి లైంగిక ఆనందం పొందడంలో హార్మోన్లది గణనీయమైన పాత్ర. హ్యాపీ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ కారణంగా రీ ఫ్రెషయిన అనుభవం కలుగుతుంది. టెస్టోస్టిరాన్ కారణంగా లైంగిక వాంఛలు కలుగుతాయి. కిస్‌పెప్టిన్ అనే హార్మోన్ కారణంగా రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. పరిశోధకులు ముద్దుగా కిస్ హార్మోన్ అని పిలిచే ఈ హార్మోన్ వల్ల సెక్స్‌కు సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 
సహజంగా విడుదలయ్యే కిస్‌పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు విడుదలవుతాయి. ఈ హార్మోన కారణంగానే రొమాంటిక్ సన్నివేశాలు, బొమ్మలను చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతోందని ఓ పరిశోధనలో తేలింది.
 
ఈ హార్మోన్ కారణంగా వంధ్యత్వ సమస్యలు తగ్గడంతపాటు, లైంగిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్న వారు ఆ సమస్య నుంచి బయటపడటానికి.. రొమాన్స్, సెక్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం తర్వాత బీట్ రూట్ ముక్కలను బాగా నమిలితే...