Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హజ్బెండ్స్ ఆ సమయంలో వారికి సహకరించే వైఫ్‌లను అప్రిషియేట్ చేయరట...

అమ్మాయిలు త‌మ గురించి తమ మనస్సుకు నచ్చిన వారు ఎక్కువగా చెప్పాలని కోరుకుంటారు. క్యూట్ కాంప్లిమెంట్స్ వినడమంటే వారికెంతో ఇష్టమట. చాలామంది అబ్బాయిలు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. ఏముంది చెప్పడానికి అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మాయిల్లో ఎన్నో గుడ్ క్వాలిటీ

Advertiesment
హజ్బెండ్స్ ఆ సమయంలో వారికి సహకరించే వైఫ్‌లను అప్రిషియేట్ చేయరట...
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (15:53 IST)
అమ్మాయిలు త‌మ గురించి తమ మనస్సుకు నచ్చిన వారు ఎక్కువగా చెప్పాలని కోరుకుంటారు. క్యూట్ కాంప్లిమెంట్స్ వినడమంటే వారికెంతో ఇష్టమట. చాలామంది అబ్బాయిలు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. ఏముంది చెప్పడానికి అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మాయిల్లో ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని వాళ్లకు ఒక్కసారి గుర్తుచేస్తుంటే చాలు.. మరింత ప్రేమ పెరుగుతుంది.
 
ఏమి అందం... అంటూ క్యూట్ కాంప్లిమెంట్స్ ఇవ్వండి : అమ్మాయిలను కొన్ని విషయాలకు దూరంగా ఉంచితే అస్సలు బతకలేరు. అందులో వారిని పొగడడం లేదా అభినందించడం ఒకటి. వారు తమను అభినందనల్లో ముంచెత్తాలని కోరుకుంటారు. కాబట్టి మగవారు ఈ విషయాన్ని అస్సలు మరిచిపోవొద్దు. వారిని ఎంత అభిమానించి అభినందిస్తే వారి నుంచి తిరిగి అంత ఎక్కువ ప్రేమను పొందగలుగుతారు. అమ్మాయిలను కొన్ని విషయాల్లో మెచ్చుకుంటే అత్యంత ఆనందం పొందుతారు. వారి లుక్స్, డ్రెస్సింగ్‌తో పాటు ఆమె చేసే ప్రొఫెషన్‌ను అభినందిస్తే ఇక వారి ఆనందానికి అవధులుండవు. అలాగే నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నీ ఫిగర్ బాగుంది అనే మాటలు కూడా కొందరు లేడీస్ ఇష్టపడతారట. కాంప్లిమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరిలో కూడా కొత్త ఎనర్జీని ఇస్తాయి.
 
నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి నీవే : ఈ మాట అంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. కానీ జీవితాంతం కూడా ఆ అబ్బాయి గుండెల్లో తనకే ఆ స్థానం ఉండాలని కోరుకుంటుంది అమ్మాయి. తన రిలేషన్‌షిప్‌ను కూడా అబ్బాయితో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ విషయంలో మగవారు అబద్ధం చెబితే మాత్రం ఆడవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందట.
 
అక్కడ నీవే నా ఏంజిల్ : బెడ్ రూమ్‌లో మహిళలు తమని గొప్పగా భావించుకుంటారట. అక్కడ ఆమెను భర్త పొగిడితే చాలా ఆనందిస్తారంట. పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటారట. అయితే చాలామంది హజ్బెండ్స్ ఆ సమయంలో వారికి సహకరించే వైఫ్‌లను అప్రిషియేట్ చేయరట. కానీ అభినందిస్తేనే చాలా మంచిది. దీని ద్వారా భార్యభర్తలిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందట.
 
ఆ సమయంలో ధైర్యం ఇవ్వాలి : చాలామంది మహిళలు పెళ్లయిన తర్వాత తాను వెంటనే తల్లి కావాలని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో కాస్త భయపడతారు. ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె ఎప్పుడూ భర్త భరోసాను కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త ఆమెకు ధైర్యం చెబుతూ ఉండాలి.
 
నీవు నాతో జీవించడానికి సిద్ధమేనా? : తనకు నచ్చిన వ్యక్తి నుంచి ఈ మాట వినాలని అమ్మాయిలు ఆశిస్తారు. ఈ విషయం అబ్బాయి నేరుగా చెబితే ఆమె ఎంతో ఆనందిస్తుంది. అయితే ఈ మాటకు తగ్గట్లుగానే ఆమెతో జీవితాంతం కలిసి ఉండడానికి సిద్ధమై ఉండాలి.
 
అభిప్రాయాన్ని తెలుసుకోండి : మీకు నచ్చిన కారు లేదా ఏదైనా డ్రెస్ కొనాలనుకున్న సందర్భంలో మీ భార్య అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఆమె ఓపినియన్‌ను గౌరవించండి. ఇలా చేస్తే వారి ప్రేమను మీరు ఈజీగా పొందొచ్చు.
 
నీవే నా డియరెస్ట్ ఫ్రెండ్‌వి: నాకు జీవితంలో నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు.. నా కష్టసుఖాలు అన్నీ నీతోనే చెప్పుకోవాలి కదా అనే మాటల ద్వారా మీ పార్టనర్ మీపై మరింత ప్రేమ పెంచుకుంటారు. దీని ద్వారా సెక్స్‌వల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందట మరి.
 
నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం: ఆమె ప్రేమ కోసం మీరు ఈ మాటను మాత్రం కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె మీ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఇంకా మీరు సింగిల్‌గానే ఉండేవారు కదా. మహిళలు ఇలా తమను అభినందించే మగవారిపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. తను వచ్చిన తర్వాత నీ లైఫ్‌లో నీకు వచ్చిన ప్రమోషన్స్ లేదా ఇతర అదృష్టాలను ఆమెకు చెప్పి థ్యాంక్స్ చెబితే తన గుండెలో ఇక మీ స్థానాన్ని ఎవరూ తొలగించలేరు.
 
నా మనసు నీకు తెలుసు: ప్రతి భార్య తన భర్త గురించి అన్ని విషయాలు తెలుసు అనుకుంటుంది. అందువల్ల నీ మనస్సులో ఏమనుకుంటున్నావో ఆ విషయాన్ని ఆమె ముందుగానే చెబుతుంటుంది. ఆ గుణాన్ని మీరు అభినందించాలి. మీకిష్టమైన వంటకం వండినప్పుడు, మీకు నచ్చే దానిని గిఫ్ట్‌గా ఇచ్చినప్పడు ఆమెను కచ్చితంగా మీరు మెచ్చుకోవాలి.
 
ఐ లవ్ యూ : ప్రతి మహిళ ఈ త్రీ మ్యాజికల్ వర్డ్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. మీ పార్టనర్‌ను మెచ్చుకుంటూ మీరు చెప్పే ఈ మాటలు మీపై ప్రేమ రెట్టింపు అయ్యేలా చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే మీ లైఫ్ పార్టనర్‌తో ఇలా ప్రేమగా మెలగండి. ఆమె మనస్సు దోచేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేపనూనె, కర్పూరంతో దోమలు పరార్.. గుడ్‌నైట్, ఆలౌట్లు అవసరం లేదండోయ్...