Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్యాయతకు... అనురాగానికి... ప్రేమకు... ఓదార్పుకు.. కౌగిలింత ఓ సంకేతం!

Advertiesment
How Hugging Makes You Healthier and Happier
, శుక్రవారం, 25 మార్చి 2016 (16:54 IST)
ఆనందంగా ఉన్న సమయంలో అయినవాళ్లు ఎదురుగా ఉంటే హృదయానికి హత్తుకుంటాం. ఆప్యాయతకు... అనురాగానికి... ప్రేమకు... ఓదార్పుకు కౌగిలింత ఓ సంకేతం. ప్రేమికులు మనసుపడ్డప్పుడు కౌగిలిలో మునిగితేలడంలో ఉన్న మధురిమలు ఆస్వాదిస్తేగాని అర్థంకాదు. పిల్లల్ని తల్లిదండ్రులు.... విద్యార్థులను గురువులు.... చిన్నారులను పెద్దలు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే కలిగే ధైర్యం... ఎంత బలాన్నిస్తోందో మాటల్లో వర్ణించలేం. 
 
కౌగిలించుకోవడం కేవలం రొమాన్స్‌ అనే భావన చాలా మందిలో ఉంటుంది. రెగ్యులర్‌ రొమాన్స్‌లో కౌగిలిదే ముందు స్థానం. ఇలాంటి కౌగిలింతలకు రొమాన్స్‌ సమయంలో ప్రాధాన్యత ఉన్నప్పటికీ... ఇతర బంధాలలో కూడా కౌగిలి చాలా సహకరిస్తుంది. స్త్రీ, పురుషుల మధ్యే కాదు... ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మధ్య కూడా కౌగిలించుకునే అవకాశముంది. కౌగిలించుకుంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది. కౌగిలిలో బంధించడం అంటే తమకున్న ఇష్టం, ప్రేమను తెలియజేయడం. ఇలాంటి కౌగిలింతల సంకేతం కూడా ఆ స్పర్శ అందిస్తుంది. 
 
స్పర్శకున్న శక్తి కొంతమందికే తెలుసు. అనారోగ్యంతో ఉన్నవారిని చేతితో తాకి పలకరిస్తే అవతలివారికి కొత్త ఉత్సాహం, ధైర్యం వస్తుంది. కౌగిలితో ఏదో మత్తు వారిద్దరి మధ్య ఆవిహస్తుంది. వెంటనే నిద్రలోకి జారిపోతారు. ఒత్తిడిలో ఉన్నవారిని ఓసారి హగ్‌ చేసుకుంటే వారు డిప్రెషన్‌‌లోంచి బయటపడతారు. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే.. తన దినచర్యను కౌగిలితో మొదలుపెడితే అంతా శుభం, సుఖం వస్తుంది. అలాగే ఆఫీసుకు వెళ్ళే ముందో... ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేముందు 30 సెకన్లు తమ వారిని హగ్‌ చేసుకుంటే.. రోజంతా ఎలాంటి ఒత్తిడులు, ఒడి దుడుకులు దరిచేరవు. ఇక రాత్రి కౌగిలి సుఖం అనుభవించకపోయినా.... ఉదయం కౌగిలించుకుని విడిపోతే ఆ రోజంతా వారి మధ్య ఎలాంటి కోపతాపాలకు తావుండదు.
 
ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురైనపుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయిని తగ్గించే శక్తి కౌగిలింతకు ఉంది. మనసు ఎంత ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటే అంత తక్కువగా కార్టిసాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్సాహంతో అందించే గుణం, మనసుకు ప్రశాంతతను అందించగలిగేవి ఈ కౌగిలింతలే. కౌగిలింతలో కరిగిపోయేవారికి గుండెజబ్బు సమస్య తక్కువని. ముఖ్యంగా ఈ కౌగిలింత థెరిఫీతో స్త్రీలకు మరింత ప్రయోజనం ఉందంటున్నారు పరిశోధకులు. 
 
కౌగిలించడంలో కూడా ఓ పద్ధతి ఉంది. ఎవరినైతే కౌగిలించుకోవాలనుకుంటున్నారో వారి కళ్ళతో మన కళ్ళను ముందు కలపాలి. ఆ తర్వాతే కౌగిలిలోకి తీసుకోవాలి. అలా కౌగిలించుకోవడంలో పూర్తి ఇష్టతను కలిగి ఉండాలి. అతి తక్కువ సమయమే అయినా అది కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. కౌగిలి నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇద్దరి చూపూ కలవాలి. అలా చూపులు కలిసినప్పుడే కౌగిలి అందించిన హాయి మరింత ముందుకు వెళుతుంది. కౌగిలి సున్నితంగా ఉండాలి. మళ్ళీ, మళ్ళీ కౌగిలిలోకి రావాలనిపించేలా ఉండాలి. ఇలాంటి కౌగిళ్ళతో ఆనందం, అత్మీయత మనకు పూర్తి స్థాయిలో వస్తుందనేది పరిశోధకులు గ్రహించినది.

Share this Story:

Follow Webdunia telugu