Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వలపు మొగ్గ తొడగాలంటే... రెప్పవాల్చకుండా చూస్తే పోలా...!!

Advertiesment
ప్రేమాయణం మధుర జ్ఞాపకాలు మహిళలు పురుషులు అతివ వలపు బ్రిటన్ సర్వే తొలిచూపు ప్రేమ బలం ద డైలీ టెలిగ్రాఫ్
, గురువారం, 26 మార్చి 2009 (13:35 IST)
తమకు ఏ మాత్రం పరిచయంలేని మహిళలు తారసపడినప్పుడు పురుషులు కనీసం 8.2 సెకన్లపాటు రెప్పవాల్చకుండా చూసినట్లయితే... వలపు మొగ్గ తొడిగినట్లేనని బ్రిటన్‌లో నిర్వహించిన తాజా సర్వే ఒకటి సెలవిస్తోంది. దీంతో.. తొలిచూపులోనే ప్రేమ చిగురిస్తుందన్న వాదనకు బలం చేకూరుస్తూ... అయితే దీనికి కూడా ఓ లెక్క ఉందంటూ పై సర్వే నిగ్గుతేల్చింది

ఈ సర్వే ఫలితాలను "ద డైలీ టెలిగ్రాఫ్" పత్రిక ప్రచురించింది. తమ సర్వే కోసం పరిశోధకులు 115 మంది విద్యార్థులను ఎంచుకున్నారనీ... వీరికి ఎదురుగా నటీనటులను కూర్చోబెట్టి వారి స్పందనలను రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించినట్లు టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది.

అబ్బాయిలు వారికి ఎదురుగా కూర్చున్న నటీమణులవైపు 8.2 సెకన్లు చూసిన పక్షంలో వారితో ప్రేమలో పడినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. అలాగే 4.5 సెకన్లపాటు చూసినవారిలో ఏ మాత్రం ప్రేమ పుట్టలేదని కూడా వారు గమనించినట్లు టెలిగ్రాఫ్ కథనం వివరించింది.

కాగా, తొలి కలయికలో చూపులు ఎంత ఎక్కువసేపు నిలిస్తే వారిపట్ల అంతగా ఆకర్షితులవుతారనీ... ఇక చూసిన నాలుగు సెకన్లకే మొహం పక్కకు తిప్పేస్తే.. అలాంటి వారిపై, పురుషులకు ఆసక్తి లేనట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఓ యువతి కనీసం 8.2 సెకన్లపాటు మగవారి చూపులను తనవైపుకు కట్టివేసినట్లయితే... ఇక వారు ఆమె ప్రేమకు దాసోహం అయినట్లుగా భావించాలని వారు చెప్పారు.

అయితే... ఈ సెకన్ల లెక్కలు ఓన్లీ.. పురుషులకు మాత్రమేననీ.. అతివలకు ఇవి ఏ మాత్రం వర్తించబోవని బ్రిటన్ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. మగువల మదిని దోచేందుకు పురుషులు ఎక్కువగా కళ్లలోకి కళ్లు పెట్టి మరీ చూస్తుంటారనీ, ఈ విషయంలో అతివలు ఆచీతూచీ వ్యవహరిస్తుంటారని వారు వివరించారు.

"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" అన్న నానుడిని మహిళలు నిజం చేస్తూ... చాలా గుంభనంగా వ్యవహరిస్తారని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు. మదిన దోచిన అందగాడు కళ్లెదుటే ఉన్నప్పటికీ, మహిళలు తమ వాలు కళ్లతో గమనిస్తూనే... చూసీ చూడనట్లుగా తమ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారని బ్రిటన్ పరిశోధకులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu