Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంధాలను తెంచేసే హాస్య శృంగారం

Advertiesment
హాస్యం ప్రేమ జీవితం సెక్స్ సినిమాలు టీవీ సీరియళ్లు శృంగారం
WD
హాస్యంతో కూడిన శృంగారభరిత చిత్రాలను అతిగా చూస్తే ప్రేమ జీవితం నిస్సారంగా మారుతుందట. సినిమా లేదంటే టీవీలలో హాస్యాన్ని మేళవిస్తూ శృంగారాన్ని ఒలకబోసే సన్నివేశాలను చూస్తే జంట మధ్య ఉన్న ప్రేమ కాస్తా ఇగిరిపోతుందట. ఎడిన్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఏ జంటలైతే హాస్యభరిత శృంగార చిత్రాలను చూస్తున్నారో వారి మధ్య ఉన్న ప్రేమ బంధం బలహీనమై పోవడాన్ని గమనించామంటున్నారు.

కొన్ని సినిమాల్లో చూపే అపార్థాలతో కూడిన ప్రేమ వ్యవహారాలను, కొన్ని జంటలు తమ నిజజీవితంతో బేరీజు వేసుకుంటున్నాయంటున్నారు. పచ్చగా ఉన్న ప్రేమను పెడాకులు చేసేసుకుంటున్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఒకేఒక్క సినిమాతో కొన్ని వందల జంటల ప్రేమ జీవితాలలో అగాధాలను సృష్టించిన సంగతులను తాము గమనించామన్నారు.

ప్రేమ బంధాన్ని గట్టిగా పట్టి ఉంచేది సెక్స్ అనే అభిప్రాయాన్ని కొన్ని జంటలు వ్యక్తపరచాయి. భర్త లేదా భార్య మరొకరితో( ఆడ లేదా మగ) తరచూ మాట్లడటం అనేది ఆరోగ్యకరమైన పరిణామం కాదనీ, అవతలి వ్యక్తితో చనువు పెంచుకోవడం, తరచూ కలుసుకోవడానికి తహతహలాడటం వంటివన్నీ పెడదోవ పట్టే మార్గాలేనంటున్నారు.

ఇటువంటివన్నీ సినిమాలు లేదా టీవీల్లో ప్రసారమవుతున్న పలు సీరియళ్ల సందేశంగా ఉంటోంది. ఫలితంగానే వారీ అభిప్రాయాన్ని వచ్చినట్లు తాము గమనించామంటున్నారు. ఒక వ్యక్తి మరొకరితో మరింత దగ్గరవుతున్నారంటే భార్య/భర్తకు దూరంగా జరుగుతున్నట్లే లెక్క అనీ పలు జంటలు అంగీకరించాయి.

ఎంతో ప్రేమానురాగాలతో ఉండే జంటల్లో అకాస్మాత్తుగా మార్పు రావడానికి ఇటువంటి చిత్రాలు లేదా టీవీ సీరియళ్లు కారణమవుతున్నాయంటున్నారు. చిత్రంగా అపార్థాలతో కూడిన ప్రేమ కథా చిత్రాలను తమ ఇళ్లలో చాలామంది దాచుకుని మరీ చూస్తున్నారట. ప్రేమానురాగలతో కూడిన సీరియళ్లను కాక పెడదోవ పట్టించే సీరియళ్లును మరింత ఆసక్తిగా చూస్తున్నట్లు తేలింది. కనుక హాస్యమే కదా అని ఇటువంటి సినిమాలు లేదా సీరియళ్లు చూస్తే లవ్ లైఫ్ సీరియస్ అవుతుందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu