Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ భావాన్ని ఆవిష్కరించండి

Advertiesment
ప్రేమ భావాన్ని ఆవిష్కరించండి

Munibabu

, మంగళవారం, 15 జులై 2008 (16:20 IST)
WD PhotoWD
ప్రేమభావం మదిని కమ్మిన వేళ ఆ ప్రేమను సొంతం చేసుకోవడానికి తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో స్త్రీ, పురషుడు అన్న బేధం లేదు. ఎందుకంటే ప్రేమభావం అనేది తొలిచూపులోనే మనసు తలుపు తట్టే ఓ మధురమైన అతిథి.

హృదయపు తలుపు తెరిచి ఆ అతిథిని ప్రేమగా ఆహ్వానించడం తప్ప కాదనడానికి ఏ మనిషి తరం కాదు. అందుకే ప్రేమభావం మదిని చేరినపుడు స్త్రీ అయినా పురుషుడైనా ఒకేలా స్పందిస్తారు. తమలో ప్రేమభావాన్ని తట్టిలేపిన ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవడానికి ఆ క్షణం నుంచి పరితపిస్తారు.

అయితే ఈ విషయంలో అబ్బాయిలు కాస్త ధైర్యంగా ముందడుగు వేసి తమ మనసులోని భావాన్ని నచ్చిన అమ్మాయి వద్ద వ్యక్తం చేయగల్గుతారు. ఎటొచ్చి అమ్మాయి విషయంలోనే కాస్త ఇబ్బంది తలెత్తుతుంది. అబ్బాయి చెప్పినంత సులువుగా అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేయలేందు.
  తనకు నచ్చినట్టు ఉండే అమ్మాయి, తనకు బాగా తెలిసిన అమ్మాయి ఇంతకంటే తాను ఇష్టపడడానికి వేరే ఏ కారణం కావాలి      


ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఓ అబ్బాయి నచ్చిన అమ్మాయి దగ్గర చెబితే అది హీరోయిజం అవుతుంది. కానీ అమ్మాయి అలా చెప్పిందంటే ఇతరుల మాట అటుంచి ఆ అబ్బాయే ఆమెను తప్పుగా అర్ధం చేసుకునే అవకాశముంది. అందుకే చాలామంది అమ్మాయిల ప్రేమ మౌనంగానే మిగిలిపోతుంది.

కానీ కాస్త సరైనతీరులో ముందుకు వెళ్లగల్గితే అమ్మాయి సైతం నచ్చిన చెలికాడిని సులభంగానే సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన పురుష పుంగవుడు ఎంతటి మేథావి అయినా కొన్ని విషయాల్లో అతనూ సాధారణ మగాడే. అందుకే మొదట అతనిలోని మగాడిని మీ వైపు చూచేలా చేయండి.

అందుకోసం మీరేమీ ఇబ్బందికరమైన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. కాస్త అందంగా, ఇంకాస్త ఆకర్షణీయంగా అతని దృష్టిలో పడండి. కానీ మీ మనసులోని భావాన్ని మాత్రం బయటపడనీయకండి. అలా కొన్ని ప్రయత్నాలు కొనసాగించారంటే ఎప్పుడో ఒకప్పుడు అతను మీ వైపు ఆకర్షితంకాకపోడు.

అప్పుడు మెల్లగా అతనిని మాటల్లో దించండి. సానిహిత్యం పెరిగేకొద్దీ అతనికి నచ్చినరీతిలో మీరు కన్పించండి. ఇవన్నీ యాదృచ్చికంగా అతనికంటపడేటట్టుగా ప్రయత్నించండి. ఆమాత్రం చేయగల్గితే చాలు. తనకు నచ్చినట్టు ఉండే అమ్మాయి, తనకు బాగా తెలిసిన అమ్మాయి ఇంతకంటే తాను ఇష్టపడడానికి వేరే ఏ కారణం కావాలి అనే భావన అతనిలో కలిగేలా చేయండి.

ఇంకేముంది అటుపై వచ్చే ఏ వాలంటైన్ డే రోజునో లేక మీ పుట్టినరోజు నాటి ముందురోజో మీ ప్రియుడు మీ వద్దకు వచ్చి రేపు నేను నీకు ఊహించలేని ఓ బహుమతి ఇస్తాను అని చెప్పకుండా పోడు. ఆ బహుమతి ఎంటో మీరు ముందే ఊహించగలరు. అయినా ఆ ఒక్కరోజు మీరు కాస్త ఓపికపట్టండి.

మరుసటిరోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకూ ఇష్టమైతే జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటా అని అతను చెప్పినపుడు ఇక ఆలోచించకుండా వెళ్లి అతని హృదయంపై వాలిపోండి. ఆపై మీ మధ్య మాటలు అవసరం లేదు. ఇరు హృదయాల్లో నిండిపోయిన ప్రేమభావం మీకు మాట్లాడే అవసరాన్ని కల్గించకపోదు. ఆ క్షణం వరకు మాటలతో భావాలు పంచుకున్న మీరు మౌనంగానూ, కను సైగలతోనూ భావాల్ని పంచుకోగల్గుతారు.

Share this Story:

Follow Webdunia telugu