Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమను త్యాగం చేస్తున్నారా... ?

Advertiesment
మధుర జ్ఞాపకాలు ప్రేమను త్యాగం చేస్తున్నారా
త్యాగం కన్నా ఈ లోకంలో గొప్పదేమీ లేదని పెద్దలు చెబుతుంటారు. ఎందరెందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు కాబట్టే ఈలోకం ఇంకా నిలిచి ఉంది అంటూ మరికొందరు చెబుతుంటారు. అందుకే త్యాగం కన్నా గొప్పదేదీ లేదని ఛాన్స్ వస్తే నువ్వు కూడా ఏదో ఓ త్యాగం చేసేసి చరిత్రలో మిగిలిపో అంటూ లెక్చర్లు దంచేస్తుంటారు.

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా ప్రేమ విషయానికి సంబంధించి ఈ త్యాగం అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఫలానావారి కోసం నేను నా ప్రేమనే త్యాగం చేశాను అని కొందరంటే నా ప్రేయసి లేదా ప్రియుడి సుఖం కోరి నా ప్రేమను త్యాగం చేశానని మరికొందరు చెబుతుంటారు.

అందుకేనేమో మన సినిమాల్లో సైతం దాదాపు చివరి సీను వరకు ప్రేమించుకుని చివరకు అమ్మ ఒప్పుకోలేదనో, నాన్న మరోకరికి మాటచ్చాడనో చెప్పి ప్రేమను త్యాగం చేసేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి హీరో లేదా హీరోయిన్ రెడీ అయిపోతుంటారు. ఇందులో ఆశ్చర్యమేమంటే సదరు హీరో లేదా హీరోయిన్ చేసిన త్యాగాన్ని వాళ్ల ప్రేయసి లేదా ప్రియుడు కూడా అశ్రు నయనాలతో సంతోషంగా అంగీకరిస్తుంటారు.
  ప్రేమ అనేది జీవితాంతం కలిసి జీవించడం కోసం ఏర్పడిన ఓ బంధమే గానీ త్యాగం పేరుతో దాన్ని మధ్యలో తుంచేసే అవసరం కాదు.       


అయితే ఇద్దరు మనస్పూర్తిగా ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నది నిజమైతే వేరెవరికో నచ్చలేదనో ప్రేమను త్యాగం చేసేసి, అప్పటివరకు జరిగిందంతా మర్చిపోయి ముందు ముందు సంతోషంగా జీవించడం అంత సులభమా అంటే నిజంగా ప్రేమించినవారెవరూ కాదనే అంటారు.


ఎవరో ఒప్పుకోలేదనో, వెరవరికో ఇష్టం లేదనో ప్రేమను త్యాగం చేసి మరొకరితో జీవితాన్ని ప్రారంభించి అటువారితో సుఖంగా జీవించలేక ఇటు మనసుకు నచ్చినవారితో కలిసి జీవించలేక సతమతమయ్యే క్షణంలో అసలు మనం ఎవరికోసం ఆనాడు మన ప్రేమను త్యాగం చేశామా అని అనుకోకమానరు.

అందుకే ప్రేమికుల మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అయిన పక్షంలో ఆ ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిన సందర్భంలో వారు ఓసారి ఆలోచించడం మంచిది. అలా ఆలోచించే సమయంలో అసలు నాలోని ప్రేమను నేనెందుకు త్యాగం చేయాలి. త్యాగం చేయడం ద్వారా నేను నిజంగానే సుఖపడగలనా నా ప్రేమను త్యాగం చేయమని చెబుతున్న వారంతా నా కోసమే చెబుతున్నారా ఇందులో వారి స్వార్థం లేక పట్టుదలలు ఏమీ లేవా అనే ప్రశ్నలను తమపై తామే సంధించుకోవాల్సిన అవసరం ఉంది.
  మన ప్రేమను త్యాగం చేసేద్ధాం అని ఎవరైనా తమ ప్రేయసి లేదా ప్రియుడి వద్ద మాట్లాడడం ప్రారంభించారంటే మీతో అప్పటివరకు సాగించిన ప్రేమ వ్యవహారం ముగింపుకు త్యాగం అనే అందమైన ముసుగు వేస్తున్నారని అర్థం.       


అలా ప్రశ్నలు వేసుకున్నప్పుడు ప్రేమను త్యాగం చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్న సమాధానమే వారికి ఎదురవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది జీవితాంతం కలిసి జీవించడం కోసం ఏర్పడిన ఓ బంధమే గానీ త్యాగం పేరుతో దాన్ని మధ్యలో తుంచేసే అవసరం కాదు.

నిజమైన ప్రేమికులెపుడూ ప్రేమించుకునే సమయంలోనే తమకు ఎదురయ్యే సమస్యల గురించి కాస్తో కూస్తో మాట్లాడుకునే ఉంటారు. ఆ సందర్భంలో తమ ప్రేమకు ఏ రూపంలో అవాంతరాలు ఏర్పడే అవకాశముంది అని కూడా ఊహించగల్గుతారు. దాంతో ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కూడా కాస్త సిద్ధంగానే ఉంటారు.

కానీ ఈ సందర్భంలో మరో విషయం గురించి కూడా మనం చర్చించుకోక తప్పదు. కొన్నిసార్లు ప్రేమికులు తమ ప్రేమ విషయంలో ఎంత పట్టుదలగా వ్యవహరించినా పెద్దవారు వారిని విడదీయవచ్చు. అలాంటి సమయంలో తప్ప మరే సమయంలోనూ ప్రేమికులకు తెలియకుండా వారి ప్రేమను వేరెవరో తుంచేయలేరు.

అందువల్ల ఫలానా విషయంలో మనకు ఇబ్బంది ఎదురవుతోంది. ఆ విషయాన్ని ఎదిరించి మనం ముందుకు వెళ్లలేం కాబట్టి మన ప్రేమను త్యాగం చేసేద్ధాం అని ఎవరైనా తమ ప్రేయసి లేదా ప్రియుడి వద్ద మాట్లాడడం ప్రారంభించారంటే మీతో అప్పటివరకు సాగించిన ప్రేమ వ్యవహారం ముగింపుకు త్యాగం అనే అందమైన ముసుగు వేస్తున్నారని అర్థం.

Share this Story:

Follow Webdunia telugu