Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దవారిని ఎదిరిస్తేనే... ప్రేమ ఉన్నట్టా... ?

Advertiesment
ప్రేమాయణం మధుర జ్ఞాపకాలు ప్రేమికులు ప్రయత్నం పెద్దవారిని ఎదిరిస్తేనే ప్రేమ ఉన్నట్టా

Munibabu

, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (18:53 IST)
లోకంలోని దేనినైనా వదలుకుంటానుగానీ, ఎవరినైనా ఎదిరిస్తానుగానీ నా ప్రేమను మాత్రం నేను వదులుకోను అంటూ ప్రేమికులు చెబుతుంటారు. నిజమే ప్రేమ చాలా గొప్పది. దానిని సాధించడం కోసం, జీవితాంతం నిలబెట్టుకోవడం కోసం కొన్నింటిని వదులుకున్నా, మరి కొందరిని ఎదిరించినా తప్పుకాకపోవచ్చు.

ఎందుకంటే ప్రేమ పేరుతో లోకంలో ఎన్నో వికృతాలకు పాల్పడుతున్నవారి మధ్య ప్రేమను కాపాడుకునేందుకు చొరవ, ధైర్యం చేసేవారిని సైతం కొన్నిసార్లు సమాజం, ఇంటిలోని వ్యక్తులు నిర్భందించేందుకు ప్రయత్నిస్తుంటారు. మేం చెబుతున్నాం కాబట్టి మీరు మీ ప్రేమను వదులుకోవాల్సిందే అంటూ తమ పంతం నెగ్గించుకోవాలనుకునే అలాంటి వారికోసం ప్రేమను బలిచేయడం ఏమాత్రం వివేకం అనిపించుకోదు.
ప్రయత్నం విజయానికి పునాది
  తమ మనసులోని ప్రేమ గురించి దానివల్ల తామేమీ నష్టపోవడం లేదని తల్లితండ్రులుగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ... పెద్దవాళ్ల మనసుని హత్తుకునేలా చెప్పగల్గితే నిజంగానే పెద్దవారి మనసు కరిగే అవకాశం ఉండవచ్చు.      


ప్రేమికుల మధ్య ఉన్నది నిజమైన ప్రేమే అయితే తమ ప్రేమను ఎదుటివారు ఏకారణం లేకుండానే నాశనం చేయాలని చూస్తుంటే ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అలాంటివారిని ఎదిరించైనా సరే ప్రేమికులు తమ ప్రేమను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు చెప్పిందంతా ప్రేమలో ఎదురయ్యే సమస్యకు ఓ పార్శ్వం మాత్రమే.

ఎందుకంటే ఇక్కడిదాకా చెప్పిందంతా ప్రేమికుల కోణం నుంచి మాత్రమే. ఎంత ప్రేమలో పడ్డా... ఆ ప్రేమ నిజంగానే స్వచ్ఛమైనదే అయినా దానికోసం తల్లితండ్రులను ఎదిరించాల్సిన అవసరం లేదు. ప్రేమకోసం చూపించిన చొరవ, ధైర్యం, తెలివితేటల్లో కాస్త మొత్తాన్ని ఖర్చుచేసి తమ తల్లితండ్రులను ఒప్పించేందుకు ప్రేమికులు ప్రయత్నిస్తే ఫలితం మరోలా ఉండవచ్చు.

తమ మనసులోని ప్రేమ గురించి దానివల్ల తామేమీ నష్టపోవడం లేదని తల్లితండ్రులుగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ... పెద్దవాళ్ల మనసుని హత్తుకునేలా చెప్పగల్గితే నిజంగానే పెద్దవారి మనసు కరిగే అవకాశం ఉండవచ్చు. అదేసమయంలో తమ పిల్లల ప్రేమ విషయాన్ని అర్థం చేసుకుని అన్నాళ్లు ఎదిరించిన తల్లితండ్రులే దగ్గరుండి మరీ ఆ ప్రేమికులు జీవిత భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కూడా కల్గవచ్చు.


ఇప్పటివరకు చెప్పినట్టు ప్రయత్నించినంత మాత్రాన తల్లితండ్రులు ఒప్పేసుకుంటారా... ? తమ పెళ్లికి అంగీకరిస్తారా... ? అంటూ ప్రేమికులకు అనుమానం రావడం సహజమే. అయితే ఇదే విషయాన్ని తాము ప్రేమలో పడ్డ కొత్తల్లో జరిగిన సంఘటనలతో పోల్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది ప్రయత్నం వల్ల ఉన్న లాభమేమిటో.

ప్రేమ సైతం ప్రేమికులిద్దర్లో ఒకేసారి ఒకే క్షణంలో కలగదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకర్ని చూచినపుడు తమలో కలిగిన ప్రేమ భావాన్ని ఎదుటివారిలోనూ కల్గించి చివరకూ వారు తమను ప్రేమించేలా చేసుకోవడమే చాలా ప్రేమల్లో జరుగుతున్నదే. అలా ప్రేమ కోసం ఎదుటివారిని ఒప్పించేందుకు ప్రేమికులు ఎన్ని ప్రయత్నాలు చెస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రయత్నం ఎన్నటికీ వృధా పోదు
  పెద్దవారిని ఎదిరించడానికి ముందు వారిని ఒప్పించేందుకు ప్రేమికులు చేసిన ప్రయత్నంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా అది భవిష్యత్‌లో అయినా పెద్దవారి మనసు మార్చవచ్చు.      


ఆ విధంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తేనే కదా... చివరకు ప్రేమ జయించి ఎదుటివారు తమ ప్రేయసి లేదా ప్రియుడు అయ్యింది. ఆ విధంగా ప్రేమకోసం ఎన్నో ప్రయత్నాలు చేసే ప్రేమికులు తల్లితండ్రులను లేదా పెద్దలను ఒప్పించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయడంలో తప్పేముంది. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వృధా పోదు.

ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లితండ్రులు ఒప్పుకోకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ఎదిరించి ప్రేమికులు ఒకటికావడంలో తప్పులేదు. అయితే అలా పెద్దవారిని ఎదిరించడానికి ముందు వారిని ఒప్పించేందుకు ప్రేమికులు చేసిన ప్రయత్నంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా అది భవిష్యత్‌లో అయినా పెద్దవారి మనసు మార్చవచ్చు.

అలా మనసు మారిన వారు మళ్లీ తమ పిల్లలకు దగ్గరకావచ్చు. అలా జరిగితే ప్రేమ కోసం పెద్దవారిని ఒప్పించేందుకు అంతకుముందు ప్రేమికులు నిజాయితీగా చేసిన ప్రయత్నమే దానికి కారణం అవుతుంది. అందుకే ఎదిరిస్తేనే ప్రేమ అవుతుంది... అనుకోవడం పొరబాటు.

Share this Story:

Follow Webdunia telugu