Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాటి ఆకులపై శృంగార రహస్యాలు

Advertiesment
తాటి ఆకులు శృంగార రహస్యాలు ప్రేమ ప్రేయసి ప్రియురాలు
మన కళలు.... సంప్రదాయాలలో శృంగారాన్ని మిళతం చేసి చూశారు మన పూర్వీకులు. నేటికీ ఇటువంటి సజీవదృశ్యాలు ఎన్నో కళ్లముందు కనబడుతుంటాయి. ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత వేరే చెప్పనక్కరలేదు.

ఆ దేవాలయం గోడలపై జయదేవుని గీతా గోవిందం, శిల్ప సంపద ఆకర్షిస్తుంటాయి. ఇటువంటి కళాఖండాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒరిస్సా కళాకారులు. తాటి ఆకులపై దేవాలయంపై ఉన్న రాతలను లిఖిస్తున్నారు. అంతేకాదు వాటి వెనుక భాగంలో వాత్సాయన భంగిమలను నిక్షిప్తం చేస్తున్నారు.

దీనిగురించి ఓ కళాకారుడు మాట్లాడుతూ... శృంగార రహస్యాలను ఇలా చాటి చెప్పడంలో ఎటువంటి తప్పు లేదంటున్నాడు. ఈ చిత్రాల పట్ల విదేశీయులు ఎంతో ఆకర్షితులవుతున్నారన్నాడు. అయితే వీటి తయారి అంత సులభం కాదంటారు. ఒక్కోదానికి కనీసం ఏడాది పడుతుందట. ఒక్కో చిత్రం కనీసం రూ. 15 వేల రూపాయలు దాకా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu