Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ స్త్రీకి రాత్రి రెండో జాములో కామోద్రేకం వస్తుంది

ఆ స్త్రీకి రాత్రి రెండో జాములో కామోద్రేకం వస్తుంది
, శనివారం, 15 అక్టోబరు 2011 (16:13 IST)
FILE
ఆడ మనిషిని తిట్టవలసి వస్తే కొన్ని సందర్భాలలో మనవాళ్లు ‘అదా..! శంఖినీ ’ అంటుంటారు. అంతేతప్ప బాబోయ్‌ హస్తినీ, అన్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ సూక్ష్మంగా చూస్తే హస్తినీ జాతిలోనే ఎక్కువ అవకరాలు కనిపిస్తుంటాయి. శరీరం, మనసు రెండూ మంచివి ఆయినట్టూ, కానట్టూ వుంటుంటాయి. ఈమెకు తిన్నగా నడవడం కూడా రాదు. కళ్లు కొంచెం వంకరగా , పొడుగ్గా వుంటాయి.

పాదాలు మరీ పొట్టి. మర్మావయవాలపై రోమాలు తక్కువ. కానీ వెడల్పుగా, లోతుగా వుంటుంది. వక్షోజాలు కుండల్లా, గుమ్మడికాయల్లా వుంటాయి. ఇలా మరీ లావుగా వుండడంతో వేలాడుతున్నట్టు వుంటాయి. పద్ద పెద్ద తొడలు, నడుము పెద్దది. పొట్ట కూడా పెద్దదే. భోజన ప్రియురాలు. తిండిబోతు కింద జమ కట్టవచ్చు. పెదవులు మందంగా వుంటాయి. కంఠస్వరం కీచుగా ఉన్నా కంచుమోగినట్టే వుంటుంది. నుదురు మెరక. దేహం లావు. వెంట్రుకలు కురచ. పెద్ద పెద్ద కళ్లు. నల్లటి జుట్టు.

హస్తినీ స్త్రీ ఏ పని చేసినా అందులో క్రూర స్వభావం గోచరిస్తుంటుంది. ఊరికూరికే చిందులు తొక్కుతుంటుంది. అయితే కపటం తెలీని మనిషి! తియ్యటి మాటలకు కరిగి నీరవుతోంది. ఎంతో గాఢంగా సంభోగిస్తేనో గానీ తృప్తి చెందదు. బాగా రతి చేయగల పురుషుడంటే ఇష్టపడుతుంది. మామిడి చిగురు రంగు చీరన్నా ఇష్టమే. కౌగిలింతలకోసం చూస్తుంటుంది. అందంగా, బలిష్టంగా వున్న యువకుల మీదికి మనసు పోతుంటుంది. రాత్రి రెండో జాములో కామోద్రేకం హ్చెచుతోంది.

ఇంతకు మించి చెప్పుకునేందుకు హస్తినీజాతి స్త్రీలో ప్రత్యేకతలు లేవు. స్త్రీ జాతులలో రకాల ప్రస్తావన అయిపోయింది. వీరిలో వీరికి ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పురుషులతో పోల్చి చూస్తే మాత్రం ఏక మొత్తంగా చాలా విషయాలలో అధికులని రసజ్ఞులు అభిప్రాయపడుతుంటారు.

‘స్త్రీణాం ద్విగుణ మహారం, బుద్ధి శ్యాపి చతుర్గుణం,
సాహసం షడ్గుణం చైవ, కామోష్టగుణి ముచ్యత్‌’ అన్నారు.

అంటే పురుషులకంటే స్త్రీలకు ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు. సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువని అర్థం. ఇందులో ఎంత వాస్తవముందో చెప్పలేం కాని సహనంలో ఆమె కచ్చితంగా పురుషునికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువని చాలా సందర్భాల్లో రుజువైన సంగతి. సహనం వున్నప్పుడే సంయమనం అలవడుతుంది.

బలహీన క్షణాలను దాటేందుకు ఈ సంయమనం ఎంతో అవసరం. అందాన్ని చూసి మనసు చెడగొట్టుకోవడంలో మగవాళ్ళకే కాక స్త్రీలకూ వాటావుంది. కాకపోతే వెంటనే బైటపడరు. ఆ తత్వమే ఈనాడు ఇన్ని కాపురాలను కవచంలా కాపాడుతోంది !. స్త్రీ తెగిస్తే మగవాడికి మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టీ దంపతలు ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ , మనసు పంచుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే లోక కళ్యాణం.

ఇక మన టాపిక్‌ ‘రతి’ విషయానికి వస్తే పై శ్లోకం ప్రకారం స్త్రీని శారీరకంగా తృప్తి పరచడం ఎంతటి వీరుడి వల్లనైనా అయ్యే పని కాదనిపిస్తుంది. స్కలనం అయ్యాక పురుషుణ్ణి పట్టి లేపడం ఆ మన్మధుడి తరం కాదు. అదే స్త్రీ అయితే భావప్రాప్తి పొంది కూడా మరొకరి పొందులో మమేకం కాగలదు. కామకళ తెలిసి సుతిమెత్తని ప్రయోగాలతో ఎందరు తయారైనా ఆమె అలసిపోవడం వుండదంటారు శాస్త్రకర్తలు.

సృష్టిలోనే మగవాడికి ఈ అన్యాయం జరిగిపోయింది. రెండు మూడు నిముషాలకు మించి నిలకడలేని ఏర్పాటుతో స్కలనచర్యను పెట్టాడు భగవంతుడు. ఇక స్త్రీలకు వరమయింది అనేవారూ వున్నారు. శీఘ్రమనే ఈ ఏర్పాటు లేకుంటే ఇప్పుడు ప్రతీ స్త్రీ సెక్సంటేనే వణికిపోయేది.

Share this Story:

Follow Webdunia telugu