Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకర్షణనే ప్రేమంటే... నిజాయితీ లేకుంటే... ?

Advertiesment
ఇతరాలు ప్రేమాయణం ఆకర్షణ ప్రేమంటే నిజాయితీ లేకుంటే బంధం ఊహల్లో భ్రమగా మహత్తరమైన శక్తి తళుక్కుమని

Munibabu

, శుక్రవారం, 24 అక్టోబరు 2008 (17:29 IST)
FileWD
ప్రేమ అనే అంశం మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రత్యేకమైనదే. చిన్ననాటి నుంచి ఎన్ని బంధాలు పెనవేసుకున్నా, మరెన్ని బంధాలు వెంటవచ్చినా యుక్త వయసులో ఏర్పడే ప్రేమ బంధం మాత్రం చెప్పలేని అనుభూతిని మిగులుస్తుంది. తనవారంటూ చెప్పుకునేవారు ఎందరున్నా తనకోసం అని చెప్పుకునే వారితో మనసు ముడివేసుకునే ఈ ప్రేమ బంధం మనిషికి చెప్పలేని ఆనందాన్ని కల్గిస్తుంది.

అందుకే ప్రేమలో పడ్డవారు తనచుట్టూ ఎందరున్నా ఒంటరిగా తన ప్రేయసి లేదా ప్రియుడి ఊహల్లో బ్రతికేస్తుంటారు. ప్రేమలో పడనివారికి, ప్రేమించే తీరికలేనివారికి, ప్రేమించాల్సిన అవసరం లేనివారికి ఇదంతా పిచ్చిగా కన్పించవచ్చు గానీ... ప్రేమ అనే లోకంలో విహరించేవారికి మాత్రం తమ ప్రేమ తప్ప లోకంలోని మిగిలినదంతా అవసరం లేనిదిగా, భ్రమగా అనిపిస్తుంది.
అప్పుడే అంత చేదా... ?
  ప్రేమ కోసం అష్ట కష్టాలు పడి చివరకు తమ ప్రేమను గెలిపించుకునే ప్రేమికుల్లో కొందరు మరి కొంతకాలానికే ప్రేమ అంటేనే మోసమని, దానివల్లే తమ జీవితం సర్వనాశనం అయ్యిందని చెబుతుంటారు.      


అందుకే ప్రేమకోసం యుగాలుగా, తరాలుగా ఎందరో ఎన్నో త్యాగాలకు సైతం సిద్ధమయ్యారు. తన వారిని త్యాగం చేయడానికైనా... చివరకు తననే త్యాగం చేయడానికైనా ప్రేమికులు సిద్ధమవుతున్నారంటే ప్రేమకున్న శక్తి ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే కాబోలు ప్రేమకు ఓ మహత్తరమైన శక్తి ఉందని, నిజమైన ప్రేమ మనసులో ఉంటే అది ప్రలోభాలకు సైతం లొంగదని మానసిక శాస్త్రవేత్తలు సైతం సూత్రీకరించారు.

కళ్లలో తళుక్కుమని, గుండెల్లోకి జారి హృదయంలో నిల్చిపోయే ప్రేయసి లేదా ప్రియుడు కోసం ప్రేమికులు పడే ఆరాటం, ఆవేదన సైతం ప్రేమికులకు ఆనందాన్నే కల్గించడం గమనార్హం. ఇంతగొప్ప చరిత్ర కలిగిన ప్రేమ కోసం అష్ట కష్టాలు పడి చివరకు తమ ప్రేమను గెలిపించుకునే ప్రేమికుల్లో కొందరు మరి కొంతకాలానికే ప్రేమ అంటేనే మోసమని, దానివల్లే తమ జీవితం సర్వనాశనం అయ్యిందని చెబుతుంటారు.


webdunia
FileWD
ప్రేమంటే జీవితంలో ఎదుగుదలకు ఆటంకమని ప్రేమిస్తే తనలాగే అందరూ పతనమైపోతారని అలాంటివారు చెబుతుంటారు. జీవితంలో ఒకటికావడానికి ముందు, ప్రేమికులుగా ఒకటయ్యేవరకు గొప్పగానూ, అద్భుతంగానూ కనిపించిన ప్రేమ అంతలోనే మోసంగానూ, జీవితానికి ప్రతిబంధకంగానూ ఎందుకు కన్పిస్తోంది అంటే అది నిజంగా ప్రేమ సమస్య కాదు.

తమలో చిగురించింది ప్రేమా కాదా అని తెలియకుండానే దానికి ప్రేమ అని పేరు పెట్టి తమను తామే మోసం చేసుకునే ప్రేమికులదే అసలు సమస్యంతా. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరినో చూచి అలా తాము కూడా ప్రేమించాలని ప్రేయసి లేదా ప్రియుడితో ఊహల్లో ఎగిరిపోవాలని తలచి ప్రేమించడం? నేడు రివాజైపోయింది.
నిజాయితీ గొప్పతనం అదే...
  మనిషి నిజాయితీగా ప్రవర్తించగల్గినపుడే ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం కూడా బలంగా ఉంటుంది. అలా ఇరువురి మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా, కలతలొచ్చినా జీవితం చివరివరకు ఆ బంధం కొనసాగగల్గుతుంది.       


మనిషి ప్రమేయం లేకుండా, అసలు మనిషికే తెలియకుండా ఏదో ఓ క్షణంలో మనసు స్పందించినపుడు మనిషి మదిలో అడుగుపెట్టేదే ప్రేమ భావన. అలా ఏర్పడేదే నిజమైన ప్రేమంటే. అలా కాకుండా అవసరం కోసమే, ఆకర్షణ చేతనో మనిషి స్పందిస్తే... ఆ స్పందనకు మనిషి ప్రేమ అని పేరు పెట్టేసినంత మాత్రానా అది ప్రేమ అనిపించుకోదు.

అలా ఎవరికైనా అనిపిస్తే అది ఖచ్చితంగా తమను తాము మోసం చేసుకోవడమే. అలా తమను తాము మోసం చేసుకున్న ప్రేమికులే చివరకు ఆ విషయాన్ని చెప్పుకోలేక తప్పంతా ప్రేమదే అని చెప్పి ఇతరుల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే జీవితంలో నిజాయితీ లేకుంటే ప్రేమతో సహా ఏ బంధాన్ని కూడా మనిషి నిలబెట్టుకోలేడు.

తమ మనసులో అడుగుపెట్టిన భావంపై స్పష్టత, అటుపై ఆ బంధానికి సంబంధించిన వారి విషయంలో మనిషి నిజాయితీగా ప్రవర్తించగల్గినపుడే ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం కూడా బలంగా ఉంటుంది. అలా ఇరువురి మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా, కలతలొచ్చినా జీవితం చివరివరకు ఆ బంధం కొనసాగగల్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu