Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలు కామం అంటే ఏంటి?

అసలు కామం అంటే ఏంటి?
, శనివారం, 22 అక్టోబరు 2011 (17:18 IST)
File
FILE
కామం అనగానే మనకు తెలిసిన అర్థం వేరు. మనకు స్ఫురణకు వచ్చే దృశ్యం వేరు. మనస్సుకీ, కామానికీ దగ్గరి సంబంధం ఉంది. కామానికీ, దేహానికీ అలాంటి సంబంధమే ఉంది. ఇదో ట్రయాంగిల్‌ వ్యవహారం. అంటే త్రికోణం. త్రికోణం అనగానే కాముకులకు దేహంలోని సుడిగుండం వంటి ప్రదేశంలో మనసు చిక్కుబడిపోతుంది. మామూలు అర్థంలో మనస్సు నుంచి దేహానికి ప్రసారం అయ్యేదే కామం. మనసే అన్నింటికీ ప్రధానం కనుకే మనసులో పుట్టిందే కామం అన్నారు. మనస్సులో పుట్టకుండా దేహంలో చలనం రాదు మరి. మన్మథుడికి ఇంకో పేరు కాముడు. అతనికి మనసిజుడు అనే పేరుంది. అంటే మనసు నుంచి పుట్టినివాడని అర్థం.

ఈ విషయాలనే వాత్స్యాయనుడు కాస్త పాలిష్‌డ్‌గా చెప్పాడు. అంతరార్థాలను విడమరిచారు. ఆత్మ అంటే జీవుడు. ఆ జీవాత్మలో లీనమై ఉన్నదే మనస్సు. మానవ దేహంలోని ప్రతి అవయవం మనస్సు ఆదేశాల మేరకే పని చేస్తుంది. చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనస్సు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తించడమే కామం అంటాడు వాత్స్యాయనుడు. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయకపోవడం గుర్తించాలి. ఇంద్రియాల ద్వారా పలు విధాలైన ఫీలింగ్స్‌ని అనుభవిస్తున్నప్పుడు జీవాత్మకు సుఖం, ఆనందం కలుగుతుంటాయి. ఆ సుఖం, ఆనందమే కామమని అతడి లెక్క.

పైన చెప్పిందంతా సాధారణ కామం. ఇది కాకుండా విశేష కామం అని ఒకటి ఉంది. అది రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య స్వర్శ కారణంగా సంభవించేది. ఇలాంటి కామం కోసమే యువతీ యువకులు మనస్సులో తపించిపోతుంటారు. రతి సమయంలో తమకంతో ఉన్న స్త్రీ దేహం సర్వ విధాలా విచ్చుకుంటుంది. సాధారణ స్థితి కంటే మరింత మృదువుగా, సున్నితంగా రూపాంతరం చెందుతుంది.

అదేసమయంలో ఆమె ప్రక్కన ఉన్న పురుషుడి దేహం, మనస్సు కర్కశంగా మారుతాయి. అలక్ష్యమైన విన్యాసాలతో స్త్రీ దేహాన్ని నొప్పించేందుకు పురుష దేహం రాటు తేలుతుంది. ఆ మొరటుతనాన్ని స్త్రీ ఇష్టపడుతుంది. తనలో ఇముడ్చుకోడానికి ప్రాణాలన్నీ కూడగట్టుకుని లోనికి ఆహ్వానిస్తుంది. సరిగ్గా ఆ క్షణాలో ముద్దుల వల్ల, రక్కుళ్ళవల్ల జివ్వున సుఖం చిమ్ముతుంది. దాన్నే అర్థ ప్రతీతి అంటారు.

స్కలనావస్థలో ఏ ఇంద్రియం అయితే సుఖానికి కారణమైన కర్మను పుట్టిస్తుందో ఆ ఇంద్రియం తాలూకూ అంతరంగిక స్పర్శ విశేష్నాని గురించిన భావమే... అర్థప్రతీతి. మామూలు మాటలో చెప్పాలంటే 'ఈ పురుషుడు నన్ను అన్ని విధాలా అనుభవిస్తున్నాడు. నా సర్వస్వాన్ని దోచుకుంటున్నాడు. నాలోని అందాన్ని, సామరస్యాన్ని పిండుకుని, వడగట్టుకుని తాగి దాహం తీర్చుకుంటున్నాడు. నాలో పిప్పిని మాత్రమే మిగులుస్తున్నాడు' అనుకుంటుంది స్త్రీ.

అలాగే, 'ఈమెను ఏ మాత్రం మిగలకుండా దోచేసుకుంటున్నా. ఈ పని నేను తప్ప ప్రపంచంలో వేరెవ్వరూ చేయలేనంతగా ముందుకెడుతున్నాను' అనుకుంటూ పురుషుడు పొందే మానసిక, శారీరక సుఖమే అర్థ ప్రతీతి.

కామశాస్త్ర అధ్యయనంలోకి వెళ్ళే ముందు ఇలాంటి ప్రాథమిక విశేషాల గురించి తెలుసుకోవాలని వాత్స్యాయనుడి హితవు. నిజానికి కామ సూత్రాలు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ సమానంగా ప్రాథమిక విశేషాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu