Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ' అస్తమయం- మృతిపై అనుమానం... సమాధి వద్ద పెళ్లిళ్లు, శిరోముండనం

దేశాన్ని విషాదంలో ముంచిన మరో ఘటన తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత అస్తమయం. డిసెంబరు 5న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి అమ్మ జయలలిత

'అమ్మ' అస్తమయం- మృతిపై అనుమానం... సమాధి వద్ద పెళ్లిళ్లు, శిరోముండనం
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:26 IST)
దేశాన్ని విషాదంలో ముంచిన మరో ఘటన తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత అస్తమయం. డిసెంబరు 5న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి అమ్మ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్ జీవో సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెను ఆమె బంధువులు కూడా కలవనివ్వకుండా చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్‌ను కూడా ఆమెను చూడనివ్వలేదు. 
 
అంతేగాకుండా అపోలో యంత్రాంగం.. ఆస్పత్రిలో జయ ఫోటోలను విడుదల చేయకపోవడంపై అనుమానాలున్నాయి. తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతోసేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్‌తో ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. అమ్మ డెత్ మిస్టరీ వీడాలని జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ విచారణ, వైద్య నివేదికలు స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ సైతం అమ్మ మృతిపై అనుమానాలున్నట్లు ప్రకటించారు.
 
ఇకపోతే జయలలిత ఖననం చేసిన మెరీనా బీచ్ సమాధిని అన్నాడీఎంకె పార్టీ శ్రేణులు, అమ్మ అభిమానులు పెద్దఎత్తున సందర్శిస్తున్నారు. కొందరు అమ్మకోసం శిరోముండనం చేయించుకుంటూ ఉండగా మరికొందరు ఆమె సమాధి వద్ద పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందుగా కౌన్సెలింగ్‌ ఇచ్చుంటే మేధావిని కోల్పోయే వాళ్లం కాదు: రోహిత్ సూసైడ్‌పై పవన్‌