దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై యున్నాడు. ఈ అహోబిల పుణ్యక్షేత్రానికి "సింగవేల్ కుండ్రం" అను పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా ఉంది.
అహోబిల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మలోల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, భావనా నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, ఛత్ర వడ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, జ్వాలానరసింహస్వామిగా నవ నరసింహుడిగా స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు. స్వామివారి ఆలయం వీడియో చూడండి