తలనీలాలతో శ్రీవారికి పెరుగుతున్న ఆదాయం!
, శుక్రవారం, 22 జూన్ 2012 (18:36 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సమర్పించిన తలనీలాలను టిటిడి జేఇఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఈ-వేలం ద్వారా విక్రయించారు. 89.413
టన్నుల తలనీలాలను విక్రయించడం ద్వారా 61.72 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 2.11 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని జేఇఒ శ్రీనివాసరాజు వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీ వద్ద 188.491 టన్నుల బరువు కలిగిన తలనీలాలు నిలువలో ఉన్నాయి.