ఉగాదిని 29నే చేసుకోవాలి... లేకుంటే ఇక అంతే..!
ఉగాది పండుగను మార్చి 29వ తేదీ బుధవారమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. శ్రీ హేవిళంబినామ సంవత్సర ఉగాది పండుగను మార్చి 29 బుధవారం ఆచరించి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొందండి.
ఉగాది పండుగను మార్చి 29వ తేదీ బుధవారమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. శ్రీ హేవిళంబినామ సంవత్సర ఉగాది పండుగను మార్చి 29 బుధవారం ఆచరించి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొందండి. 28 మార్చి మంగళవారం అమావాస్య ఉదయ 8:30 వరకు ఉన్నందున అమావాస్యతో కూడిన చైత్రశుద్ధ పాఢ్యమి సందిఘడియలతో కూడుకున్న మంగళవారం ఉగాది పండగను ఆచరించడం వలన ఆ సంవత్సరం అంతా చెడుఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. 29 బుధవారం బ్రాహ్మి ముహూర్తంలో సూర్యోదయ సమయానికి చైత్రశుద్ధ పాఢ్యమి ఘడియలు ఉండడం వలన ఉగాది పర్వదినాన్ని ఆచరించాలి.
శృంగేరి పీఠం మరియు ఉత్తరాది మఠపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానంలు మరియు శ్రీశైల దేవస్థానం, పూర్వ సిద్ధాంత పంచాంగకర్తలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దేశ క్షేమం, రాష్ట్రాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని సకాల వర్షాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, బ్రాహ్మి ముహూర్తం సూర్యోదయ, అరుణోదయ ముహూర్తంలోని పాఢ్యమిని గుర్తించి ఉగాది పండుగను పంచాంగ శ్రవణాన్ని 29 బుధవారం ఉగాది పండగను ఆచరించడం లోక క్షేమానికి మంచిది.
గతంలో 2007 మార్చి 19న శ్రీ సర్వజిత్‌నామ నామ సంవత్సర ఉగాదిని సోమవారం ఆచరించిన వారు శుభ ఫలితాలను పొందారు. మంగళవారం ఆచరించిన వారు చెడు ఫలితాలను చవిచూశారు. మంగళవారం ఉగాది పండుగను అనేక మంది చేసుకోలేదు. ఈ సంవత్సరం అదేవిధంగా మంగళవారం కాక బుధవారం ఉగాది పండుగను చేసుకోవడం సకల జనులకు క్షేమమని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా మంగళవారం ఉగాది చేసుకుంటే ఇక వారి జీవితంలో కష్టాలేనంటున్నారు పండితులు.