చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన సేవను వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం పలు కరాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
మే 26న స్వర్ణ రథోత్సవం
మే 26వ తేదీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.