కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ : రెండు గంటల్లో శ్రీవారి దర్శనం...
తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో
తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా కాలినడక దర్శనం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్సనభాగ్యం లభిస్తోంది. కాగా, శుక్రవారం శ్రీవారిని 72,217మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం కోటి 89 లక్షల రూపాయల రాబడి రాగా 40,050 మంది భక్తులు స్వామివారి తలనీలాలను సమర్పించారు.