Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట

తిరుమల శ్రీవారి దర్శనంలో బ్రేక్ ముఖ్యమైనది. సాధారణంగా టిటిడి ఎల్-1, ఎల్-2, ఎల్ -3 టిక్కెట్లను అందిస్తూ వస్తోంది. తిరుమలలోని టిటిడి జెఈఓ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకునే వ్యక్తుల క్యాడర్‌ను బట్టి ఈ దర్శనాలను ఇస్తుంటారు. అయితే ఈ దర్శనాల్లో మార్పులు తీసుకు

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (17:50 IST)
తిరుమల శ్రీవారి దర్శనంలో బ్రేక్ ముఖ్యమైనది. సాధారణంగా టిటిడి ఎల్-1, ఎల్-2, ఎల్ -3 టిక్కెట్లను అందిస్తూ వస్తోంది. తిరుమలలోని టిటిడి జెఈఓ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకునే వ్యక్తుల క్యాడర్‌ను బట్టి ఈ దర్శనాలను ఇస్తుంటారు. అయితే ఈ దర్శనాల్లో మార్పులు తీసుకువచ్చారు టిటిడి అధికారులు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.
 
ఎల్ -1కు ఇచ్చే ప్రయారిటీని అలాగే ఉంచి, ఎల్-2, ఎల్ -3ని ఒకటిగా చేశారు. ఎల్ -1 అంటే స్వామివారికి సమీపం వరకూ అక్కడ శఠగోపం పెట్టించుకుని తిరగడం, ఎల్-2 అంటే స్వామివారి ముందు వరకు వెళ్ళి హారతి తీసుకోవడం, ఎల్-3 అంటే స్వామివారి ముందు వరకు మాత్రమే వెళ్ళడమన్నమాట. అయితే ప్రస్తుతం ఎల్-2, ఎల్-3 ఒకటే విధంగా ఉంటుందంటున్నారు టిటిడి అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపిలను త్వరితగతిన పంపించేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో అయితే ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి. సామాన్యుల రెకమెండేషన్ లెటర్లు తీసుకోరు. ఈ మొత్తం వ్యవహారం కేవలం10 వారాల పాటు మాత్రమే ఉంటుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు ప్రకారం.. ఇంట్లో అక్వేరియం ఉంటే? అప్పులేనా?