Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులూ తిరుమలలో స్వామి లడ్డూలు లేవు...?

లడ్డూలు దొరకవా... ఏంటిది.. ఎప్పుడూ వినలేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తిరుమల లడ్డూలు దొరుకుతుంది. అలాంటి తిరుమల లడ్డూలు దొరకదని ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును. లారీల సమ్మె ప్రభావం ఏకంగా తిర

శ్రీవారి భక్తులూ తిరుమలలో స్వామి లడ్డూలు లేవు...?
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (15:10 IST)
లడ్డూలు దొరకవా... ఏంటిది.. ఎప్పుడూ వినలేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తిరుమల లడ్డూలు దొరుకుతుంది. అలాంటి తిరుమల లడ్డూలు దొరకదని ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును. లారీల సమ్మె ప్రభావం ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూలపై పడింది. లడ్డూలను సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు ఆగిపోవడంతో లడ్డూల సరఫరా భారంగా మారింది. దీంతో లడ్డూల తయారీ నిలిచిపోనుందట. ఇప్పటికే అత్యంత భారంగా లడ్డూలను తయారుచేస్తున్నారు. లారీల సమ్మె ఇలాగే కొనసాగితే మాత్రం లడ్డూలు ఇక భక్తులకు దొరకదంటున్నారు టిటిడి అధికారులు. 
 
గత 8 రోజులుగా లారీల సమ్మె కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సమ్మె కారణంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులు మినహాయించి లారీలను ఆపేశారు లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. అయితే ఇన్ని రోజుల వరకు టిటిడికి సంబంధించి నెయ్యి సరఫరాను ఒక కాంట్రాక్టర్ చేసేవారు. ఆ కాంట్రాక్టర్ కాలం ముగియడంతో కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. లారీల సమ్మె కారణంగా ఆ కాంట్రాక్టర్ కూడా చేతులెత్తేశాడు. 
 
పప్పులను సరఫరా చేశాడు కానీ. లడ్డూకు అవసరమయ్యే నెయ్యిని సరఫరా చేయలేకపోయాడు. దీంతో 6 లక్షల లడ్డూల నుంచి ప్రస్తుతం 3 లక్షల లడ్డూలను మాత్రమే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం నెయ్యి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఇక లడ్డూలు తయారుచేయడం బారంగా మారింది. 
 
ఇప్పటికే లడ్డూలు దొరక్కుండా ఇబ్బందులు పడుతున్న భక్తులకు లారీల సమ్మెతో అస్సలు లడ్డూలే లేకుండా పోవడం ఖాయమంటున్నారు టిటిడి అధికారులే. అయితే గురువారం మధ్యాహ్నం లారీల యజమానులతో ప్రభుత్వం చర్చలు పిలవడంతో ఒకవేళ ఆ చర్చలు సఫలం అయితే లడ్డూల సరఫరా యథావిధిగా జరుగుతుంది. లేకుంటే ఇక లడ్డూలు దొరకడం భక్తులు కష్టమేనంటున్నారు తితిదే అధికారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్లీల వీడియోలు చూసినా దోషమే.. కామంతో శరీరం వేడెక్కితే?