తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 7వ తేదీన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య మహూర్తం నిర్ణయించామని.. కలేక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాలో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ కళ్యాణమస్తు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా వున్నట్లు వైవి ప్రకటించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావాలని తెలిపారు.
2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయని గుర్తు చేశారు.
2011 మే 20వ తేదిన కళ్యాణమస్తు చివరి విడత నిర్వహించింది టిటిడి. ఇందులో నకీలి జంటలు కళ్యాణమస్తు కార్యక్రమంలో అందజేసే బంగారు తాళిబోట్టులు కోసం వివాహం చేసుకుంటున్నారని విజిలెన్స్ రిపోర్ట్ అందింది. దీంతో కళ్యాణమస్తు కార్యక్రమం ఆగిపోయింది.