Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు మరో శుభవార్త... ఏంటది?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు సామాన్య భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఒకరకంగా ఇది శుభవార్తే. వయోవృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా త

Advertiesment
TTD facility
, గురువారం, 1 జూన్ 2017 (17:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు సామాన్య భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఒకరకంగా ఇది శుభవార్తే. వయోవృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం పూర్తయ్యే అవకాశాన్ని తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కల్పించారు. స్వయంగా క్యూ లైన్లను పరిశీలించిన ఆయన భక్తులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వయోవృద్ధులు, వికలాంగులకు అతి త్వరగా దర్శనం అయ్యే అవకాశం టిటిడి కల్పిస్తోంది. 
 
ఇంతకుముందు తిరుమలలో వయోవృద్ధులకు, వికలాంగులకు తెల్లవారుజామున 750 టిక్కెట్లు, సాయంత్రం 750 టిక్కెట్లు మంజూరు చేసేవారు. వారివారి గుర్తింపు కార్డులు, మెడికల్ సర్టిఫికెట్లు చూసిన తరువాతనే టిక్కెట్లను ఇచ్చేవారు. ఉదయం నుంచి చాలామంది భక్తులు లైన్లో ఉన్నా వారికి టిక్కెట్లు దొరకేవి కావు. అలాంటివారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉదయాన్నే 1500 టిక్కెట్లను భక్తులకు ఇచ్చేయాలని ఈఓ ఆదేశించారు. వీరి కోసం ప్రత్యేకంగా మ్యూజియం వద్ద ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి టిటిడి ప్రారంభించింది. ఉదయం టోకెన్ తీసుకున్న భక్తులు టోకెన్ సమయం ప్రకారం దర్శనానికి లైన్లో వెళితే త్వరితగతిన దర్శనం పూర్తవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలిలో 3 బాణాల ప్రయోగం: మహాభారతం నుంచి కాపీ కొట్టిందేనా? బార్బరిక్ ఎవరు?