తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు దర్శనం కోసం వేచి ఉండే కంపార్టుమెంట్లతో పాటు తలనీలాలు ఇచ్చే క్యూలైన్లు, డార్మెటరీలను పరిశీలించారు. శ్రీవారి భక్తులకు టిటిడి సిబ్బంది అందించే సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
గదులు పొందేటప్పుడు టిటిడి సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తారో, అలాగే తలనీలాల వద్ద క్షురకులు ఏ విధంగా నడుచుకుంటారోనని భక్తులను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంతమంది భక్తులు తితిదే సిబ్బంది తమతో సక్రమంగానే నడుచుకుంటున్నారని చెప్పడంతో ఇఓ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. క్యూలైన్లలోని భక్తులతో పాటు గదులు దొరక్కుండా వేచి ఉండే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని టిటిడి ఇఓ సిబ్బందిని ఆదేశించారు.