Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమియుమి అస్సెట్స్ కంపెనీతో తిరుపతి నగరాభివృద్ధి: వారణాసికి తర్వాత తిరుపతి..

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయం నెలకొన్న తిరుమల, తిరుపతి నగరాల అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నడుం బిగించారు. దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాతి చెందిన టెంపుల్ సిటీ అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు

Advertiesment
కుమియుమి అస్సెట్స్ కంపెనీతో తిరుపతి నగరాభివృద్ధి: వారణాసికి తర్వాత తిరుపతి..
, శుక్రవారం, 20 జనవరి 2017 (14:21 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయం నెలకొన్న తిరుమల, తిరుపతి నగరాల అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నడుం బిగించారు. దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాతి చెందిన టెంపుల్ సిటీ అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. అలాంటి తిరుపతిని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. 
 
మొన్నటికి మొన్న తిరుమల వెంకన్న కొలువుదీరిన మహానగరంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.1500 కోట్లతో మ్యూజియం నిర్మించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన 'కుమియుమి అస్సెట్స్ కంపెనీ' ముందుకు వచ్చింది.
 
బుధవారం దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని సీఎంకు వివరించారు. 
 
కుమియుమికి ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందట. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించారట. దీనికి స్పందించిన సీఎం స్పష్టమైన ప్రణాళికతో రావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రవచనకర్త చాగంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇక ఆయన ప్రవచనం చేయారా?