Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీనివాసుని లీలలకు అద్భుతమైన ఉదాహరణ.. చదివితే మీకే తెలుస్తుంది..

ఈరోజు తిరుమలలో ఒక సంఘటన జరిగింది. దేవుడి లీలలు, అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకానికి సంబంధించి లక్కీ డిప్‌లో అభిషేకం టికెట్లు 16 ఉన్నాయి. ఆన్‌లైన్ కౌంటర్ల వద్ద భక్తులు బారులుతీరి ఉన్నారు. తమి

Advertiesment
తిరుమల శ్రీనివాసుని లీలలకు అద్భుతమైన ఉదాహరణ.. చదివితే మీకే తెలుస్తుంది..
, సోమవారం, 22 జనవరి 2018 (21:51 IST)
ఈరోజు తిరుమలలో ఒక సంఘటన జరిగింది. దేవుడి లీలలు, అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకానికి సంబంధించి లక్కీ డిప్‌లో అభిషేకం టికెట్లు 16 ఉన్నాయి. ఆన్‌లైన్ కౌంటర్ల వద్ద భక్తులు బారులుతీరి ఉన్నారు. తమిళనాడుకు చెందిన భక్తబృందం ఆ లైన్లో నిలబడి ఉంది. 
 
అంతకుముందే ఈ తమిళనాడు బృందం లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లను నమోదు చేసుకుంది. ఆ టిక్కెట్లు మంజూరు అయ్యాయో లేదో తెలుసుకునేందుకు క్యూలైన్లో నిలబడి ఉంది. అయితే ఈసారి రాలేదని నిరాశగా బయటికి వచ్చింది తమిళనాడు భక్త బృందం. భక్త బృందం బయటకు వస్తుండగా ఒక వ్యక్తి ఒకరు నా దగ్గరకు వచ్చి.... తమిళంలో ఇలా చెప్పాడు.
 
"అక్కడ ఒక వ్యక్తి ఎందుకో ఏడుస్తూ వున్నారు. అతని భాష నాకు అర్థం కావడం లేదు ఏమిటో కనుక్కోండి దయచేసి అన్నారు."
 
సరే వెళ్లి కనుక్కుందామని వెళ్లి అతన్ని ఆడిగాము. అతను హిందీలో ఇలా చెప్పాడు.
 
"అందరూ లక్కిడిప్ వేస్తుంటే నేను కూడా వేశాను. నాకు మెసేజ్ వచ్చింది.... టికెట్టు తీసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు... కానీ నన్ను పరీక్షించడానికి దేవుడు నాకు లక్కిడిప్‌లో తన దర్శనం అవకాశం ఇచ్చాడు.. కానీ నేను దరిద్రుణ్ణి.. అంత డబ్బు నా దగ్గర లేదు."అని చెప్పాడు
 ఆ విషయాన్ని ఆ తమిళ వ్యక్తితో చెప్పాము... వెంటనే ఆ తమిళ వ్యక్తి 750 రూ. తన జేబు నుండి తీసి టికెట్ తానే స్వయంగా తీసి ఇచ్చాడు..
 
ఆ హిందీ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
కంట తడితో ఆ తమిళ వ్యక్తికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు.
 
అప్పుడు ఆ తమిళ వ్యక్తి ఇలా అన్నాడు...
నేను కూడా లక్కీడిప్‌లో అభిషేకానికి నమోదు చేసాను. నాకు రాలేదు... నా దగ్గర డబ్బు ఉన్నా ఆ అదృష్టం నాకు లేదు.. దేవుడి లీల చూడండి... ఆ అదృష్టం అతనికి లభించింది... డబ్బు లేదు... అతనికి ఆ డబ్బును ఇవ్వడం వల్ల నాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు..."అన్నారు.
 
నిజంగా ఆ తమిళ వ్యక్తిలో నాకు దేవుడు కనిపించాడు.
ఆ స్వామి లీలలు చూడండి డబ్బు లేకపోయినా తనకు ఆ అవకాశాన్ని ఇచ్చారు... డబ్బులేదని ఏడుస్తుంటే తానే ఆ భక్తునికి ఒక దారిని చూపారు.... ఇలాంటి లీలలు ఎన్నో.... ఎన్నెన్నో... కష్టాలున్నాయని కృంగిపోకండి... ఆ దేవదేవుడే ఒకదారిని కూడా తప్పకుండా చూపుతారు. ఇదంతా చూశారు ఒక టిటిడి ఉద్యోగి.. తమిళ భక్తబృందానికి నమస్కారాలు చేశాడు. చూశారా.. తిరుమల శ్రీవారి లీలలు. స్వామివారి అందరినీ అప్పుడప్పుడూ పరీక్షిస్తూ ఉంటారనడానికి ఇదే ఉదాహరణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం మీ దినఫలాలు .. లౌక్యంగా వ్యహరించడం... (వీడియో)