Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో మోస్తరు రద్దీ - స్వామి దర్శనానికి 6 గంటలు..

తిరుమలలో మోస్తరు రద్దీ - స్వామి దర్శనానికి 6 గంటలు..
, మంగళవారం, 3 మే 2016 (12:54 IST)
తిరుమలలో రద్దీ మోస్తరుగా ఉంది. ఆది, సోమవారాలు రద్దీ ఉండడంతో ఆ రద్దీ మంగళవారం కూడా కొనసాగుతోంది. రద్దీ సమయంలో రెండురోజుల పాటు దర్శనం దొరకని భక్తులు మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శనం 6 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 4 గంటల సమయం పడుతోంది. అయితే తలనీలాల వద్ద గాని గదులు వద్ద గాని పెద్దగా రద్దీ లేదు. సులభంగానే గదులు భక్తులకు లభిస్తున్నాయి. నిన్న శ్రీవారిని 81, 513మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 23లక్షల రూపాయలు లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ ఉత్తర్వులు... ప్రమాణ స్వీకారం లేకుండానే...