Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ... 15 కంపార్టుల్లో భక్తులు

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ... 15 కంపార్టుల్లో భక్తులు
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:30 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నాలుగు రోజులుగా బోసిపోయి కనిపించిన తిరుమల ప్రస్తుతం రద్దీతో కొనసాగుతోంది. 
 
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 6 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలకుపై పడుతోంది. గురువారం శ్రీవారిని 66,658 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.42 కోట్ల మేరకు వసూలైంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతుడికి-శ్రీ కృష్ణుణికి ఇష్టమైన వెన్నకు ఏంటి సంబంధం?