దేవస్థానము నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నదని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు తెలిపారు.
దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు నిత్య ఆర్జిత సేవలయందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులుచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవి.
భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణము, మృత్యుంజయ హోమము, గణపతి హోమం, శ్రీచక్రనవావర్ణార్చన సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామములతో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది.
కావున ఈ సేవలు పరోక్షముగా జరిపించుకోనదలచిన భక్తులు టిక్కెట్లు online నందు kanakadurgamma.org ద్వారా పొందవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపియున్నారు.