తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విరాళాలకు కొదవలేదు. ప్రతి రోజు ఎవరో ఒకరు స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా భువనేశ్వర్‌కు చెందిన త్రిజల్ ఎంటర్ ప్రైజస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు సాలిగ్రామ హారాలను తయారు చేయించి విరాళంగా అందజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకమండపంలో తితిదే ఈఓ సాంబశివరావుకు ఈ సాలిగ్రామాలను అందజేశారు దాత. ఈ సాలిగ్రామ హారాలను స్వామివారికి త్వరలో అలంకరించనున్నారు.