Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరవేగంగా బూంది పోటు మరమ్మత్తు పనులు

Advertiesment
Repair works
, సోమవారం, 13 జూన్ 2016 (10:35 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బూందిపోటు పనులను తితిదే అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయంకు అతిసమీపంలో ఉన్న ఈ బూంది పోటులో కొత్త సామగ్రిని అమరుస్తున్నారు తితిదే సిబ్బంది. 
 
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనలను తితిదే పాటిస్తోంది. ప్రస్తుతం నాలుగు వరుసల్లో రెండింటిని 20 పొయ్యిలపై బూంది తయారీ ముమ్మరంగా జరుగుతోంది. 
 
లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నాలుగు వరుసల్లోని 40 గ్యాస్‌ పొయ్యిలు పనిచేసే విధంగా పనులు చేస్తున్నారు. తితిదే ఈఓ సాంబశివరావు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు.. మూడుమునకలేస్తే దీర్ఘాయుస్సు....!