Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారికి వైభవోపేతంగా పుష్పయాగం

తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆన

Advertiesment
Pushpa Yagam
, మంగళవారం, 8 నవంబరు 2016 (13:55 IST)
తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
15వ శతాబ్ధంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడోరోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్థాంతరంగా ఆగిపోయినా ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్‌ 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.
 
పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, మూడు రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామి వారికి పూజలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్