Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు.

14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
, ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:50 IST)
తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, దేవస్థానం సిబ్బంది కారణంగా తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను తితిదే యేటా నిర్వహిస్తోంది. 
 
ఉత్సవాల నేపథ్యంలో 13న వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, 14 నుంచి 16వరకు విశేష పూజ , అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. అర్చన, తోమాలసేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం నాగ పంచమి - గరుడ పంచమి... పూజ ఎలా చేయాలి?