తిరుమలలో కాటేజీలు దొరకడం చాలా ఈజీ.. ఎలాగో తెలుసా...!
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కొంతమందికి భక్తులకు గదులు దొరికితే మరికొంతమందికి దొరకదు. గంటల తరబడి గదుల కోసం వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోతుంటారు.
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కొంతమందికి భక్తులకు గదులు దొరికితే మరికొంతమందికి దొరకదు. గంటల తరబడి గదుల కోసం వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోతుంటారు. కొంతమందైతే ఆరుబయటే పడుకొని ఆ తర్వాత శ్రీవారి దర్శనార్థం వెళుతుంటారు. అలాంటి పరిస్థితిని గమనించిన తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. చాలా సులువుగా భక్తులకు గదులు దొరికే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ఈఓ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
గతంలో గదుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇక నుంచి అలా కాదు. తిరుమలలో ప్రత్యేకంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ల వద్దకు వెళ్ళి భక్తుడు తన పేరు, సెల్‌నెంబర్ ఇచ్చి బయటకు వచ్చేయవచ్చు. గదులు ఖాళీ అయ్యిందో ప్రయారిటీ ప్రకారం భక్తుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
మెసేజ్ వచ్చిన అరగంటలోపే కౌంటర్ల వద్దకు వెళ్ళి గదులు తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోకుంటే వెనుక ఉన్న మరొకరికి అవకాశం వస్తుంది. గదుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం ఇక ఉండదు. త్వరలోనే ఈ కౌంటర్లను తితిదే ప్రారంభించనుంది. తితిదే తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్యభక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.