Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి లడ్డూ తయారీ.... అన్నదానం బంద్?.. ఆకలితో అలమటించనున్న భక్తులు!

తిరుమల శ్రీవారి అన్నదానంతో పాటు లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా వెంకన్న లడ్డూకు పేటెంట్ హక్కులు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో లడ్డూతో పాటు అన్నదానం కూడా బంద్ కానుంది. దీంతో భక్తులు ఆకలిత

శ్రీవారి లడ్డూ తయారీ.... అన్నదానం బంద్?.. ఆకలితో అలమటించనున్న భక్తులు!
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:46 IST)
తిరుమల శ్రీవారి అన్నదానంతో పాటు లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా వెంకన్న లడ్డూకు పేటెంట్ హక్కులు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో లడ్డూతో పాటు అన్నదానం కూడా బంద్ కానుంది. దీంతో భక్తులు ఆకలితో అలమటించనున్నారు. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత ఎనిమిది రోజులుగా ఈ సమ్మె సాగుతోంది. దీంతో తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్రకొరత ఏర్పడింది. రోజువారీ వితరణలో భాగమైన అన్న ప్రసాదాల తయారీకి సైతం ఇబ్బందులు ఏర్పడుతుండగా, మరో మూడు రోజుల్లో సరుకులు కొండపైకి చేరుకోకుంటే, భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూల తయారీ కష్టమవుతుందని టీటీడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 
 
అలాగే, శ్రీవారి మిగిలిన శ్రీవారి ప్రసాదాలైన పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, దోశలు వంటి వాటి తయారీకి అవసరమయ్యే పదార్థాలు సైతం నిండుకున్నాయని, సమాచారం. సరుకులను ఎలాగైనా కొండపైకి తెప్పించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు సహకరించాలని టీటీడీ స్థానిక లారీ యజమానుల సంఘాన్ని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి సాధారణ భక్తులకు తితిదే షాక్.. రూ.50 సుదర్శన టిక్కెట్లు రద్దు.. ఏప్రిల్ 1 నుంచే?