చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తితిదే నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంతమండపానికి వేంచేస్తారు. తొలి రెండు రోజులు మే 25, 27 తేదీలలో శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీక్రిష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
వసంత రుతువుతో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం. రెండోరోజు మే 26 నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వూంజల్ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.